Naga Chaitanya: నాగ చైతన్య ఫోటో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ ఫొటోలో ఆయన జంటగా కనిపించడమే దానికి కారణం. అది కూడా ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్న హీరోయిన్ తో. విషయంలోకి వెళితే కొద్ది నెలల క్రితం నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎఫైర్ నడుపుతున్నారంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. శోభిత-నాగ చైతన్య వ్యవహారం ముదిరింది. ఇద్దరూ జంటగా విహరిస్తున్నారు. నాగ చైతన్య కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి పలుమార్లు ఆమెను తీసుకెళ్లాడు. శోభిత దూళిపాళ్లను ఘాడంగా ప్రేమిస్తున్న నాగ చైతన్య ఆమెను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారని, వరుస కథలు వెలువడ్డాయి.

ఈ పుకార్లకు నాగ చైతన్య టీమ్ వివరణ ఇచ్చారు. శోభిత ధూళిపాళ్లతో ఎఫైర్ రూమర్స్ ని గట్టిగా ఖండించారు. అదే సమయంలో ఈ ప్రచారం వెనుక ఎవరో ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోయిన్ శోభిత సైతం ఈ పుకార్లపై స్పందించారు. ఆమె సోషల్ మీడియా వేదికగా ఖండించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలంటూ మండిపడ్డారు. దాంతో ప్రచారానికి తెరపడింది.
తాజాగా ఈ రూమర్ మళ్ళీ తెరపైకి వచ్చింది. శోభిత-నాగ చైతన్య కలిసి ఉన్న ఫోటో బయటకు రావడంతో వివాదం మొదలైంది. విదేశీ వీధుల్లో కలిసి చక్కర్లు కొడుతున్నట్లున్న ఆ ఫోటోని ప్రస్తావిస్తూ నాగ చైతన్య-శోభిత ఎఫైర్ నిజమే అంటున్నారు. ముఖ్యంగా సమంత అభిమానులు ఈ ఫోటో తెగ వైరల్ చేస్తున్నారు. అప్పుడు అంతా అబద్ధం అన్నారు. ఇప్పుడు ఈ ఫోటోకి ఏం సమాధానం చెబుతారు, అంటూ ప్రశ్నిస్తున్నారు.
అయితే నాగ చైతన్య ఫ్యాన్స్ ఆ ఫోటో రియల్ కాదంటున్నారు. ఎవరో మార్ఫింగ్ చేశారని వాదిస్తున్నారు. జాగ్రత్తగా గమనిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. నాగ చైతన్య, శోభిత వేరు వేరు సందర్భాల్లో దిగిన ఫోటోలు జత చేసి క్రియేట్ చేసిన ఫేక్ ఫోటో అంటున్నారు. నాగ చైతన్య ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం ఇలాంటి దుష్ప్రచారానికి తెరలేపుతున్నారని అంటున్నారు. వాస్తవం ఏదైనా… శోభిత-నాగ చైతన్యల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఒకరిపై మరొకరు తమ టీమ్స్ ద్వారా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారనే వాదన ఉంది. ఈ క్రమంలో తాజాగా శోభిత-నాగ చైతన్యల ఫోటో సోషల్ మీడియాలోకి రావడం వెనుక ఎవరున్నారనేది ప్రాధాన్యత సంతరించుకుంది.