Inaya Sultana- Siri And Shrihan: ఈ వారం మొత్తం బిగ్ బాస్ ఎపిసోడ్స్ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎంట్రీ మరియు బిగ్ బాస్ కోచింగ్ సెంటర్ టాస్కు తో గడిచిపోయింది..ఇప్పటి వరుకు రేవంత్ కుటుంబ సభ్యులు మినహా మిగిలిన కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులందరు హాజరయ్యారు..చాలా రోజుల తర్వాత తమకి ఇష్టమైన వారిని చూసేలోపు హౌస్ మేట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది..నిన్న శ్రీహాన్ కోసం అతని కాబొయ్యే భార్య సిరి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ఎపిసోడ్ లో వీళ్లిద్దరి మధ్య జరిగిన రొమాన్స్ మరియు చిట్ చాట్ ప్రేక్షకులను బాగా అలరించింది..సిరి బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ కావడం తో బిగ్ బాస్ ఆమెతో కాసేపు ఆడుకున్నాడు..ఇక తర్వాత ఈమె శ్రీహాన్ తో ఏకాంతం గా కొంచెంసేపు మాట్లాడింది..టైటిల్ గెలుచుకునే కెపాసిటీ ఉన్న కంటెస్టెంట్ నువ్వు..కానీ నువ్వు సొంతం గా గేమ్ ఆడు..ఒకరి కోసం గేమ్ ఆది నీ కెపాసిటీ ని తగ్గించుకోకు అని సిరి సలహా ఇస్తుంది.
అంటే రేవంత్ మరియు శ్రీ సత్య తో కలిసి గేమ్ ఆడొద్దు అని పరోక్షంగా శ్రీహాన్ కి హింట్ ఇచ్చేసింది సిరి..ఇక హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి శ్రీహాన్ మరియు ఇనాయ కి గొడవలు జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే..మధ్యలో వీళ్లిద్దరు కలిసిపోయారు కానీ మళ్ళీ నామినేషన్స్ అప్పుడు వీళ్లిద్దరి మధ్య గొడవలు చెలరేగాయి..అయితే నిన్న సిరి ఇనాయ కి సపోర్టుగా బాగా మాట్లాడింది..ఆమె మాట్లాడుతూ ‘ఏమి ఇనాయ..ఈమధ్య మావాడిని పట్టించుకోవడం మానేసావు’ అంటూ జోక్ వేస్తుంది.

ఆ తర్వాత ఆమె ఇంటి సభ్యులతో కాసేపు ముచ్చటిస్తున్న సమయం లో ‘బిగ్ బాస్ హౌస్ లో ఫైర్ తగ్గిందా’ అని ఇనాయ సిరి ని అడుగుతుంది..’ఇక్కడ ఎవరికైనా ఫైర్ తగ్గుద్దేమో కానీ నీలో మాత్రం అసలు ఫైర్ తగ్గలేదు తల్లి..అదేమీ ఫైర్ బాబోయి’ అని పొగడ్తలతో ముంచి ఎత్తేస్తుంది..’లేదు ఈమధ్య నా ఆట తగ్గింది అనిపిస్తుంది’ అని ఇనాయ బదులివ్వగా, ‘వారం వారం కి నీ ఆట ఇంప్రూవ్ అవుతూ పోతుంది’ అని బదులిస్తుంది సిరి..అలా వీళ్లిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ చూసి శ్రీహాన్ ఒక వింత ఎక్స్ప్రెషన్ పెడుతాడు..ఎపిసోడ్ మొత్తానికి ఇది హైలైట్ గా నిలిచింది.