Geetu Royal: గీతూ రాయల్ ఒక విషయంలో తెగ ఫీలైపోతుంది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఒక్కరు కూడా నన్ను ట్రై చేయలేదు, అంటూ ఓపెన్ అయ్యింది. దీంతో ఇదేంట్రా బాబు రివర్స్ లో మాట్లాడుతుండని ఆడియన్స్ షాక్ తిన్నారు. అందం, స్థాయితో సంబంధం లేకుండా ఒక ఆడపిల్ల ఇండస్ట్రీకి వచ్చిందంటే వేధింపులు సర్వసాధారణం. కొందరు మోసగాళ్లు ప్రేమ పేరుతో లేదా కెరీర్, ఆఫర్స్ ఆశచూపి లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. అమాయకపు అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడతారు.

పరిశ్రమలో ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయని అమ్మాయిలకు కూడా తెలుసు. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తారు. అలాంటి పరిస్థితులు ఎదురుకాకూదని కోరుకుంటారు. గీతూ దీనికి భిన్నంగా ఉన్నారు. తనను ఎవరూ ప్రేమించలేదని, కనీసం ఇంప్రెస్ చేసే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదని చెప్పింది. బహుశా నేను అందంగా ఉండకపోవడం వల్లనేమో కానీ… నన్ను ఇంతవరకు ఎవరూ ట్రై చేయలేదని చెప్పింది.
ఇక గీతూ మాటలకు ఆదిరెడ్డి, రేవంత్ వరుసగా సెటైర్లు వేశారు, నువ్వు అందంగానే ఉంటావు కానీ దారిన పోయే కంపను తగిలించుకోవడం ఎందుకని భావించి ఉంటారని ఆదిరెడ్డి అన్నాడు. రేవంత్ అయితే వాళ్ళు అదృష్టవంతులు నీతో పెట్టుకుంటే అయిపోతారని తెలుసు అంటూ ఎగతాళి చేశారు. కాగా తనను ఎవరూ గెలకలేదు, అక్కా అని పిలిచేవారని చెప్పి గీతూ సంతోషపడుతుందో? లేక జంట దొరకలేదని బాధపడుతుందో ?అర్థం కాలేదు.

బిగ్ బాస్ హౌస్లో కూడా గీతూకి ఎవరూ దగ్గరకు కావడం లేదు. దానికి ఆమె మ్యారీడ్ అనేది ముఖ్య కారణం. అదే సమయంలో గీతూ యాటిట్యూడ్ మాట తీరు కొంచెం కరుకుగా ఉంటాయి. ఆదిరెడ్డి మాత్రమే అక్కా అంటూ స్నేహం చేస్తున్నాడు. ఇంకెవరితోనూ గీతూ అంత సన్నిహితంగా ఉండరు. కాగా ప్రతివారం నామినేషన్స్ లో ఉంటున్న గీతూ ఈ వారం ఉపశమనం పొందారు. ఏడవ వారం అత్యధికంగా 13 మంది నామినేషన్స్ లో ఉన్నారు. రేవంత్, బాలాదిత్య, రోహిత్, వాసంతి, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ, అర్జున్, కీర్తి, శ్రీ సత్య, మెరీనా, రాజ్, ఫైమా నామినేట్ అయ్యారు.