https://oktelugu.com/

Geetu Royal: 40 ఏళ్లకే చనిపోతా, డాక్టర్స్ చెప్పేశారు… భయంకరమైన వ్యాధి బారిన పడిన బిగ్ బాస్ గీతూ రాయల్!

ట్రెండ్ కి తగట్టు రీల్స్ చేస్తుంది. అప్పుడప్పుడు రిలేషన్ షిప్స్, లవ్ మేటర్స్ కి సంబంధించిన ఉచిత సలహాలు ఇస్తుంటుంది. తాజాగా గీతూ రాయల్ ఓ వీడియో పోస్ట్ చేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 30, 2024 / 01:48 PM IST

    Geetu Royal suffering from Bacterial infection

    Follow us on

    Geetu Royal: టిక్ టాక్ వీడియోలు చేస్తూ పాపులర్ అయింది గలాటా గీతూ. ఆ తర్వాత బిగ్ బాస్ రివ్యూలు చెప్తూ ఏకంగా బిగ్ బాస్ సీజన్ 6 లో ఛాన్స్ కొట్టేసింది. టాప్ 5 లో ఉంటుంది అనుకుంటే అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. గత ఏడాది ముగిసిన సీజన్ 7 బిగ్ బాస్ బజ్ షో హోస్ట్ గా మారింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేసి మరింత క్రేజ్ దక్కించుకుంది. గీతూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.

    ట్రెండ్ కి తగట్టు రీల్స్ చేస్తుంది. అప్పుడప్పుడు రిలేషన్ షిప్స్, లవ్ మేటర్స్ కి సంబంధించిన ఉచిత సలహాలు ఇస్తుంటుంది. తాజాగా గీతూ రాయల్ ఓ వీడియో పోస్ట్ చేసింది. సదరు వీడియో చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. గత ఐదు నెలలుగా ఆమె డిప్రెషన్ లో ఉన్నట్లు తెలిపింది. అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు చెప్పి షాక్ కి గురి చేసింది. గీతూ రాయల్ మాట్లాడుతూ .. నేను 5 నెలలుగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాను.

    దీనికి కారణం నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు బొద్దింకలు, పురుగులు వంటి ఆహారపదార్ధాలు తిన్నాను. అందువల్లే నేను అనారోగ్యానికి గురయ్యాననే సందేహం కలుగుతుంది అన్నారు. గీతూ రాయల్ మరో సందేహం కూడా వ్యక్తీకరించింది.. ఒకసారి విజయవాడ వెళ్ళాను .. అమ్మవారి గుడి దగ్గర వరకు వెళ్లి కూడా దర్శించుకోకుండా వచ్చేసాను. ఈ రెండు సంఘటనల తర్వాత నా ఆరోగ్యం పాడైంది.

    మొదట నాకు ఒక గాయం అయింది. మందులు వాడుతున్నా తగ్గలేదు. తర్వాత ఓ పెద్ద హాస్పిటల్ లో టెస్టులు చేయిస్తే అసలు విషయం తెలిసింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయిందని, రెండు ఏళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు. ప్రతి వారం ఒక ఇంజెక్షన్ కూడా తీసుకోవాలన్నారు. దీంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారు సరైన ఫుడ్, నిద్ర తో పాటు డాక్టర్లు చెప్పిన విధంగా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. లేదంటే హెల్త్ మరింత పాడవడమే కాకుండా .. 40 ఏళ్లకు మించి బతకడం కష్టం అని డాక్టర్లు చెప్పినట్టు గీతూ రాయల్ షాకింగ్ మేటర్ రివీల్ చేసింది. ఎనర్జిటిక్ గా కనిపించే గీతూ రాయల్ ఇంతటి సమస్యలో ఉందా అని ఫ్యాన్స్ వాపోతున్నారు.