Bigg Boss 6 Telugu Revanth: బిగ్ బాస్ 2వ వారం జోరుగా సాగుతోంది. తొలి వారం ఎలిమినేషన్ ను రద్దు చేసిన నాగార్జున రెండో వారంలో ఎలిమినేషన్ ఉంటుందని.. బాగా ఆడాలని హితబోధ చేశాడు. రెండో వారం రాజ్, షానీ, అభినయశ్రీ, రోహిత్-మెరినా, ఫైమా, గీతూ, ఆదిరెడ్డి, రేవంత్ లు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది వచ్చే వారం తేలనుంది. అయితే ఓటింగ్ ను బట్టి చూస్తే అందరికంటే చివరన ఐటెం గర్ల్ అభినయశ్రీ ఉంది.

హౌస్ లో అందరికంటే ఎక్కువగా సింగర్ రేవంత్ ను కంటెస్టెంట్లు నామినేట్ చేస్తున్నారు. రేవంత్ వైఖరి బిగ్ బాస్ లో చాలా దురుసుగా ఉంటోంది. అందరిపై రుసరుసలాడుతూ.. గొడవలు పెట్టుకుంటూ ఫస్ట్రేషన్ లో కనిపిస్తున్నాడు. ఊరికే చిన్న పిల్లాడిలా ఏడ్చేస్తున్నాడు. ఎమోషన్స్ ను అస్సలు కంట్రోల్ చేసుకోవడం లేదు. ఎవరైనా లొల్లికి వస్తే వారితో వాగ్వాదం ఓ రేంజ్ లో పెట్టుకుంటున్నారు
అందుకే నామినేషన్స్ వస్తే చాలు ఇంటి సభ్యులంతా ఏకగ్రీవంగా రేవంత్ తప్పులు ఎత్తి చూపి నామినేట్ చేస్తున్నారు. తొలి వారంలో.. రెండో వారంలో అత్యధికంగా కంటెస్టెంట్లు నామినేట్ చేసింది రేవంత్ నే. షోలో రేవంత్ తీరు కూడా సగటు ప్రేక్షకుడికి నచ్చడం లేదు. నిన్న ఫైమాను అన్యాయంగా కింగ్ ఆఫ్ ది రింగ్ టాస్క్ నుంచి రేవంత్ తొలగించడం ఎవ్వరికీ మింగుడుపడలేదు. సంచాలకుడిగా ఉంటూ ఇలా ఫైమాకు అన్యాయం చేశాడని అందరూ ఆడిపోసుకున్నారు. ప్రేక్షకులు సైతం రేవంత్ తీరుతో అతడికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు.

ఇప్పటికే నాగార్జున తొలి వారం రేవంత్ ను హెచ్చరించాడు. నువ్వు చాలా చూసి వచ్చావని.. నీకున్నంత అనుభవం హౌస్ లోని వారికి లేదని.. కోపం తెచ్చుకోకుండా నిగ్రహం కోల్పోకుండా కూల్ గా ఉండాలని సూచించాడు. అయినా కూడా అలా ఉండకుండా రేవంత్ రెచ్చిపోతున్నాడు. ప్రేక్షకుల నుంచి కూడా ద్వేషాన్ని పొందుతున్నాడు. ఇలాగే సాగితే రేవంత్ ఎలిమినేట్ అయిపోతాడని అందరూ అంటున్నారు.