Bigg Boss 6 Telugu Vote: బిగ్ బాస్ 2వ వారం జోరుగా సాగుతోంది. తొలి వారం ఎలిమినేషన్ ను రద్దు చేసిన నాగార్జున రెండో వారంలో మాత్రం ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. రెండో వారం రాజ్, షానీ, అభినయశ్రీ, రోహిత్-మెరినా, ఫైమా, గీతూ, ఆదిరెడ్డి, రేవంత్ లు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది వచ్చే వారం తేలనుంది. అయితే ఓటింగ్ ను బట్టి చూస్తే అందరికంటే చివరన ఐటెం గర్ల్ అభినయశ్రీ ఉంది.

గడిచిన వారం కూడా అభినయశ్రీ లాస్ లో నిలిచింది. ఇనాయా, అభినయశ్రీ ఇద్దరే తొలి వారం నామినేషన్స్ లో చివరలో నిలిచారు. తొలి వారమే అయ్యిందని.. ఇంకా ఎవరూ ఎవరికి అర్థం కాలేదంటూ నాగార్జున ఎలిమినేషన్ రద్దు చేశారు. దీంతో ఇనాయా, అభినయశ్రీ సేఫ్ అయిపోయారు.లేదంటే ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండేది. లక్కీగా తప్పించుకున్నారు.

కానీ ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉండనుంది. రెండో వారంలో రాజ్, షానీ, అభినయశ్రీ, రోహిత్-మెరినా, ఫైమా, గీతూ, ఆదిరెడ్డి, రేవంత్ లు ఎలిమినేషన్ లో ఉన్నారు. ఇందులో అత్యధిక ఓట్లతో సింగర్ రేవంత్ టాప్ లో ఉన్నాడు. ఇక ఆ తర్వాత స్థానంలో జబర్ధస్త్ ఫైమాకు అత్యధిక ఓట్లు పడ్డాయి. ఈమె రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక మూడో స్థానంలో జోడి మెరినా-రోహిత్ ఉంది. 4వ స్థానంలో ఆదిరెడ్డి, 5వ స్థానంలో గీతూ రాయల్, 6వ స్థానంలో రాజశేఖర్, 7వ స్థానంలో షానీ, చిట్టచివరన 8వ స్థానంలో అభినయశ్రీ ఉంది.

దీన్ని బట్టి ఈ వారం ఖచ్చితంగా అభినయశ్రీ ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. లేదంటే ఆమెతోపాటు సరిసమానంగా ఓట్లు వచ్చినా కాస్త ఎడ్జ్ లో ఉన్న షానీ సాల్మాన్ సైతం ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొటున్నాడు. వీరిద్దరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అంటున్నారు.