Bigg Boss 5 Winner VJ Sunny : బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ విజే సన్నీ దొంగతనానికి పాల్పడ్డాడు. ఒక ఏటీఎంలో డబ్బులు కాజేసి,క్యాష్ బ్యాగ్ తో పాటు కారులో పారిపోయాడు. విజే సన్నీ రాబరీ కి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న సన్నీ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఫైనల్ లో షణ్ముఖ్ జస్వంత్-విజే సన్నీ టైటిల్ కోసం పోటీపడ్డారు. షణ్ముఖ్ కంటే అధిక ఓట్లు సంపాదించిన విజే సన్నీ టైటిల్ తో పాటు ప్రైజ్ మనీ అందుకున్నాడు.

సీరియల్ నటుడైన విజే సన్నీ బిగ్ బాస్ విన్నర్ గా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ షో ఆయనకు ఇమేజ్ తెచ్చింది. ఈ క్రమంలో సన్నీకి హీరోగా ఆఫర్స్ వస్తున్నాయి. గత ఏడాది సకలకళాభిరామ టైటిల్ తో ఓ మూవీ చేశారు. ఆ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇంతలో అతడు దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
అయితే ఇది నిజమైన దొంగతనం కాదు లెండి. జస్ట్ పబ్లిసిటీ స్టంట్. ఈ మధ్య కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం చిన్నా చితకా హీరోలు ఈ టెక్నిక్ వాడుతున్నారు. విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ ప్రమోషన్ కోసం చేసిన పని విమర్శల పాలైంది. లక్ష్మణ్ అనే వ్యక్తి రోడ్డుపై కిరోసిన్ పోసుకొని సూసైడ్ చేసుకుంటానని హంగామా చేశాడు. హెవీ ట్రాఫిక్ రోడ్లపై ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేసి జనాన్ని ఇబ్బంది పెట్టడం ఏమిటని… విశ్వక్ సేన్ ని సోషల్ మీడియా ద్వారా జనాలు ఏకిపారేశారు.
అలాగే బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరో నందు… నేరుగా రష్మీ గౌతమ్ షూటింగ్ చేస్తున్న స్టూడియోకి వెళ్లి గొడవ పడినట్లు ఓ వీడియో విడుదల చేశాడు. సన్నీ సైతం అలాగే సెన్సేషన్ క్రియేట్ చేసి, తన కొత్త సినిమాకు ప్రచారం తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. అన్ స్టాపబుల్ టైటిల్ తో తెరకెక్కిన చిత్రంలో సన్నీ హీరోగా నటించాడు. డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన అన్ స్టాపబుల్ మూవీలో సప్తగిరి మరో హీరోగా నటించాడు. అన్ స్టాపబుల్ విడుదలకు సిద్ధం అవుతుండగా… సన్నీ ఇలా జనాలకు ఝలక్ ఇచ్చాడు.
https://youtu.be/gbDQB5G4Htw