VJ Sunny Injured: షూటింగ్ లో నిజమైన బుల్లెట్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బిగ్ బాస్ విన్నర్ సన్నీ!

బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా , కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న సన్నీ, ఇప్పుడు డైమండ్ రత్నం బాబు దర్శకత్వం లో 'అన్ స్టాపబుల్' అనే సినిమా చేస్తున్నాడు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సందర్భంగా సినిమా విడుదల తేదీ ప్రకటన ఒక డిఫరెంట్ ప్రోమో లాగ చిత్రీకరించే ప్రయత్నం చేసాడు డైరెక్టర్ డైమండ్ రత్నం బాబు.

Written By: Shiva, Updated On : May 15, 2023 8:29 am

VJ Sunny Injured

Follow us on

VJ Sunny Injured: స్టార్ మా లో ప్రతీ ఏడాది ప్రసారమయ్యే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్స్ మంచి పాపులారిటీ ని సంపాదించుకొని నేడు టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొంతమంది కంటెస్టెంట్స్ అయితే హీరోలు కూడా అయిపోయారు. అలా హీరోలు అయిపోయిన వారిలో ఒకడు VJ సన్నీ.

బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా , కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న సన్నీ, ఇప్పుడు డైమండ్ రత్నం బాబు దర్శకత్వం లో ‘అన్ స్టాపబుల్’ అనే సినిమా చేస్తున్నాడు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సందర్భంగా సినిమా విడుదల తేదీ ప్రకటన ఒక డిఫరెంట్ ప్రోమో లాగ చిత్రీకరించే ప్రయత్నం చేసాడు డైరెక్టర్ డైమండ్ రత్నం బాబు.

ముందుగా కమెడియన్ సప్తగిరి పోలీస్ గెటప్ లో గన్ పట్టుకొని 30 ఇయర్స్ పృథ్వి వద్దకి వచ్చి ‘అన్ స్టాపబుల్’ సినిమా ఎప్పుడు విడుదల అవ్వబోతుంది అని అడుగుతాడు. అప్పుడు పృథ్వి ఏమో సార్ నాకు తెలియదు అంటాడు, ఆ తర్వాత సన్నీ ని అడుగుతాడు, అతను కూడా నాకు తెలియదు అనడం తో గన్ తో షూట్ చేస్తాడు.

ఈ గన్ లో ఉన్నది డమ్మీ బుల్లెట్ అయ్యినప్పటికీ , దగ్గర నుండి కాల్చడం తో సన్నీ కి తీవ్రమైన గాయం అయ్యింది. దీనితో వెంటనే ఆయనని సమీపం లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యవసర చికిత్స అందించారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తుంది.దీనితో సన్నీ కి బుల్లెట్ తగిలిందని ఆందోళన చెందిన ఆయన అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.