Bigg Boss Telugu : గత బిగ్ బాస్ సీజన్ లో సామాన్యులను హౌస్ లోకి తీసుకొని రావడం కోసం, ‘అగ్నిపరీక్ష’ అనే షో ని నిర్వహించి, ఆ షోకి వచ్చిన వేల అప్లికేషన్స్ లో కేవలం 45 మందిని మాత్రమే ఎంపిక చేసి, ఆ 45 మందిలో కేవలం 15 మందిని మాత్రమే ఫిల్టర్ చేసి, ఆ 15 మందిలో 7 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. వీరిలో ఒకరు విన్నర్ అవ్వడం, మరొకరు టాప్ 3 లోకి ఎంట్రీ ఇచ్చి 15 లక్షల సూట్ కేసు తో బయటకు రావడం ఒక సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. టాప్ 3 లో ఇద్దరు సామాన్యులు రావడంతో బిగ్ బాస్ టీం ‘అగ్నిపరీక్ష 2’ ని మొదలు పెట్టడానికే సిద్ధమయ్యారు. ఈ ఏడాది మే నెల నుండే అగ్నిపరీక్ష రెండవ సీజన్ మొదలు కాబోతుంది. ఈ సీజన్ ని వేరే లెవెల్ లో ప్లాన్ చేస్తున్నరాట బిగ్ బాస్ టీం.
ఈసారి లక్షల్లో అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నందున, సెలక్షన్ ప్రక్రియ కూడా చాలా కఠినంగా ఉండబోతుందని టాక్. గత సీజన్ కి జడ్జీలుగా బిందు మాధవి, అభిజిత్ మరియు నవదీప్ లు వ్యవహరించిన సంగతి తెలిసిందే. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది. ఈ సీజన్ లో కూడా పాత కంటెస్టెంట్స్ ని జడ్జీలుగా పిలవబోతున్నారట. వారిలో శివాజీ కచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గత సీజన్ కి శివాజీ ని పిలిచారు, కానీ ఆయన సినిమా షూటింగ్స్ లో బాగా బిజీ గా ఉండడం వల్ల ఆ సీజన్ కి రాలేకపోయాడు. కానీ ఈ సీజన్ లో మాత్రం ఆయన కచ్చితంగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మరో జడ్జీ గా సీజన్ 5 టైటిల్ విన్నర్ సన్నీ ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట.
ఇక మూడవ జడ్జీగా ఈ సీజన్ రన్నర్ గా నిల్చిన తనూజ ని పిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అదే కనుక జరిగితే ఆమె ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. అంతే కాకుండా ‘అగ్నిపరీక్ష’ లో ఎవరైతే టాప్ 15 వరకు వచ్చి హౌస్ లో అడుగుపెట్టకుండా వెళ్లిపోయారో, వాళ్లకు సీజన్ 2 లో అవకాశం ఇవ్వబోతున్నారట. అంటే షాకిబ్, కల్కి , అనూష రత్నం, నాగ ప్రశాంత్ వంటి వారు నేరుగా ఎంపిక అయ్యినట్టే. అదే విధంగా ఈ సీజన్ లో కామానర్స్ వచ్చి టైటిల్ విన్నర్ గా నిల్చిన పవన్ కళ్యాణ్, టాప్ 3 కంటెస్టెంట్ డిమోన్ పవన్ లు కూడా జ్యూరీ లో మెంబెర్స్ గా ఉంటారని ఒక టాక్ వినిపిస్తుంది.