https://oktelugu.com/

Bigg Boss 5 Telugu : ఈ ప‌ద్ధ‌తి స‌రైందేనా.. ఆ హీరోను అవ‌మానించ‌డం కాదా నాగార్జున‌?

Bigg Boss 5 Telugu :  బిగ్ బాస్ షోను గ‌త మూడు సీజ‌న్లుగా స‌క్సెస్ ఫుల్ గా ర‌న్‌ చేస్తున్నారు నాగార్జున‌. త‌న‌దైన వాక్ఛాతుర్యంతో అటు కంటిస్టెంట్ల‌ను, ఇటు ఆడియ‌న్స్ ను అల‌రిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు సీజ‌న్ల‌కు హోస్ట్ గా ఉన్న‌ప్ప‌టికీ.. ఎక్క‌డా రిమార్కు రాలేదు. అయితే.. తాజాగా బిగ్ బాస్ షో స్టేజ్ పై నాగార్జున వ్య‌వ‌హ‌రించిన తీరు విమ‌ర్శ‌లకు తావిచ్చింది. ఇది చూసిన వారంతా.. ఇదేం ప‌ద్ధ‌తి నాగ్..? ఇది అవ‌మానించ‌డం […]

Written By:
  • Rocky
  • , Updated On : September 19, 2021 / 03:20 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu :  బిగ్ బాస్ షోను గ‌త మూడు సీజ‌న్లుగా స‌క్సెస్ ఫుల్ గా ర‌న్‌ చేస్తున్నారు నాగార్జున‌. త‌న‌దైన వాక్ఛాతుర్యంతో అటు కంటిస్టెంట్ల‌ను, ఇటు ఆడియ‌న్స్ ను అల‌రిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు సీజ‌న్ల‌కు హోస్ట్ గా ఉన్న‌ప్ప‌టికీ.. ఎక్క‌డా రిమార్కు రాలేదు. అయితే.. తాజాగా బిగ్ బాస్ షో స్టేజ్ పై నాగార్జున వ్య‌వ‌హ‌రించిన తీరు విమ‌ర్శ‌లకు తావిచ్చింది. ఇది చూసిన వారంతా.. ఇదేం ప‌ద్ధ‌తి నాగ్..? ఇది అవ‌మానించ‌డం కాదా? అని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్నిస్తున్నారు.

    ప్ర‌స్తుతం బిగ్ బాస్ – 5 హాట్ హాట్ గా సాగిపోతోంది. మాటీవీలో ఈ షో ర‌న్ అవుతోంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ ఛాన‌ల్ ను ప్ర‌ముఖ యాజ‌మాన్యం స్టార్ టీవీ అప్పుడెప్పుడో కొనుగోలు చేసింది. అందుకే.. స్టార్ మా అని పేరు మారింది. అయితే.. ఓటీటీ రంగంలోనూ స్టార్ యాజ‌మాన్యం ఉన్న సంగ‌తి తెలిసిందే. డిస్నీ హాట్‌ స్టార్ పేరుతో ర‌న్ అవుతున్న‌ ఓటీటీకి హీరో రామ్ చ‌ర‌ణ్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నారు. లేటెస్ట్ గా చెర్రీని నియ‌మించుకుంది స్టార్ యాజ‌మాన్యం.

    దీంతో.. బిగ్ బాస్ షోకు రామ్ చ‌ర‌ణ్ ను ఆహ్వానించారు. చెర్రీతోపాటు ‘‘మాస్ట్రో’’ సినిమా టీమ్ కూడా హాజరైంది. నితిన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం.. ప్ర‌స్తుతం హాట్ స్టార్ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఈ మూవీ టీమ్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పై సంద‌డి చేసింది. అయితే.. ఈ టీమ్ లోని వారిని స్టేజ్ పైకి ఆహ్వానించాడు నాగార్జున‌.

    అయితే.. హీరోయిన్ త‌మ‌న్నాను హ‌గ్ చేసుకొని ప‌ల‌క‌రించాడు నాగ్. ఆ త‌ర్వాత మురో హీరోయిన్ న‌భా న‌టేష్ ను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆహ్వానించాడు. కానీ.. హీరో నితిన్ ను మాత్రం కేవ‌లం పంచ్ ఇచ్చి ప‌ల‌క‌రించాడు. క‌రోనా కార‌ణంగా ఈ మ‌ధ్య చాలా మంది పంచ్ ల‌తో ప‌ల‌క‌రించుకుంటున్నారు. ఇది చూసిన వారంతా నాగ్ పై సెటైర్లు వేస్తున్నారు.

    త‌మ‌న్నాను ఏకంగా హ‌గ్‌చేసుకున్నారు. న‌భా న‌టేష్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. నితిన్ కు షేక్ హ్యాండ్ ఇస్తేనే క‌రోనా వ‌చ్చేస్తోందా? అని సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై మీమ్స్ కూడా చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ‘‘నేను ఆడ‌వాళ్ల‌ను హ‌గ్ చేసుకోకుండా ఉండ‌లేను’’ అని నాగ్ అంటున్నట్టుగా మీమ్స్ వదిలారు. మరికొందరు మాత్రం.. ఇది నితిన్ అవమానించడం కాదా? అని నాగార్జున‌ను ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి, దీనికి ఆయ‌న ఏం చెబుతారో?