Maruti Cars: సాధారణంగా మారుతి కార్లు అంటే చాలామంది ఎక్కువగా లైక్ చేస్తారు. మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అన్ని రకాల కార్లు Maruti Suzuki కంపెనీ నుంచి మార్కెట్లోకి వస్తాయి. అయితే ప్రతి ఏడాది రెండు కంటే ఎక్కువగా కార్లను తీసుకువచ్చే ఈ కంపెనీ 2025 ఏడాదిలో మాత్రం విక్టోరిస్ మిడ్ సైజ్ SUV నీ మాత్రమే రిలీజ్ చేసింది. అయితే 2026 లో మాత్రం ఏకంగా ఒకేసారి మూడు వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధం చేసింది. వీటిలో రెండు EV లు ఉండగా.. ఒక ఫ్లెక్స్ ఫ్యూయల్ ఉంది. అయితే గతంలో వచ్చిన బ్రెజా కాంపాక్ట్ SUV ని సైతం అప్డేట్ చేయబోతుంది. మరి ఈ వివరాల్లోకి వెళితే..
మారుతి సుజుకి గ్రాండ్ విటారా గురించి తెలిసిందే. కానీ 2026 లో ఇది E విటారాగా రాబోతుంది. కొత్త ఏడాది ప్రారంభంలోనే దీనిని మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఇందులో 49 కిలో వాట్, 61 కిలో వాట్ రిని అమర్చారు. ఒకసారి దీనిని చార్జింగ్ చేస్తే 543 కిలో మీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఫైవ్ స్టార్ రేటింగ్ను పొందిన ఈ కారు మార్కెట్లోకి వస్తే మహీంద్రా బిఈ 6, హుందాయి క్రెటా ఎలక్ట్రిక్ వంటి వాహనాలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. దీనిని రూ.15 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Maruti Suzuki ఈసారి కొత్త ప్రయోగం చేయనుంది. EV తోపాటు ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ కలిగిన FRONX FLEX FUEL కారును మార్కెట్లోకి తీసుకురాబోతుంది.. 2026 మిడిల్ ఇయర్ లో వచ్చే ఈ కారులో 85% ఇథనాల్, 15% పెట్రోల్ మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. దీనిని రూ.9.50 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది.
ఇదే కంపెనీ నుంచి వచ్చే ఏడాది చివరిలో YMC అనే కోడితో ఎలక్ట్రిక్ కారు రాబోతుంది. ఈ విటారా ప్లాట్ఫారం పైనే ఆధారపడే ఈ కారు లో 49 కిలో వాట్, 61 కిలో వాట్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 550 కిలోమీటర్ వరకు మైలేజ్ ఇవ్వనుంది.
వీటితోపాటు breeza SUV ని అప్డేట్ చేసి మార్కెట్లోకి తీసుకురానున్నారు.ఇలా వచ్చే ఏడాది మూడు కార్ల తో పాటు అప్డేట్ చేసిన వెహికల్ ను రిలీజ్ చేయడానికి మారుతి సుజుకి కంపెనీ సిద్ధమవుతోంది. అయితే లేటెస్ట్ టెక్నాలజీ తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్లతో వస్తున్న ఈ కార్లలో ఆకట్టుకునే ఫీచర్లు ఉండనున్నాయి. అంతేకాకుండా సరసమైన ధరలతో ఉండడంతో చాలామంది వీటిని కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు.