https://oktelugu.com/

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ టైటిల్ మా క్యాస్ట్ వాడే కొట్టాలి… అరె ఎటు పోతుందిరా ఈ సమాజం!

Bigg Boss Telugu 5: సమాజంలో క్యాస్ట్ ఫీలింగ్ అనేది వేళ్లూనుకుపోయిన సమస్య. ఉద్యోగం, విద్య, వైద్యం, రాజకీయం, సినిమా… రంగం ఏదైనా క్యాస్ట్ ఫీలింగ్ జాడలే రాజ్యం ఏలుతున్నాయి. ప్రతి పనిలో టాలెంట్ తో సంబంధం లేకుండా ప్రయోజనం మాత్రం, మా కులపోడికే దక్కాలనే స్వార్ధం రోజురోజుకు ఎక్కువైపోతోంది. గ్రహాంతరాలలోకి తొంగి చూస్తున్న మనిషి, ఈ కుళ్లు కులాంతరాల గోడలు దాటలేకపోవడం విచారకరం. మంచి చెడు ఆలోచించకుండా, మన కులపోడు టాప్ లో ఉండాలనే జనాల […]

Written By:
  • Shiva
  • , Updated On : November 30, 2021 / 10:03 AM IST
    Follow us on

    Bigg Boss Telugu 5: సమాజంలో క్యాస్ట్ ఫీలింగ్ అనేది వేళ్లూనుకుపోయిన సమస్య. ఉద్యోగం, విద్య, వైద్యం, రాజకీయం, సినిమా… రంగం ఏదైనా క్యాస్ట్ ఫీలింగ్ జాడలే రాజ్యం ఏలుతున్నాయి. ప్రతి పనిలో టాలెంట్ తో సంబంధం లేకుండా ప్రయోజనం మాత్రం, మా కులపోడికే దక్కాలనే స్వార్ధం రోజురోజుకు ఎక్కువైపోతోంది. గ్రహాంతరాలలోకి తొంగి చూస్తున్న మనిషి, ఈ కుళ్లు కులాంతరాల గోడలు దాటలేకపోవడం విచారకరం.

    మంచి చెడు ఆలోచించకుండా, మన కులపోడు టాప్ లో ఉండాలనే జనాల సంకుచిత స్వభావం పోయేది ఎప్పుడు ? నలుగురికి స్ఫూర్తి నిచ్చే స్థాయిలో ఉన్నవాళ్ల మనస్సులోకి తొంగి చూసినా, ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనే మరక కనిపించకమానదు. తాజాగా ఈ కుల ఫీలింగ్ బిగ్ బాస్ షోకి కూడా తాగింది. హౌస్ లో ఉన్నవాళ్ళలో ఎవరు ఏ కులమో తెలుసుకొని, మన కులం అని తెలిసినోడిని మన ఉద్దండ పురుషులు ఆకాశానికి లేపేస్తున్నారు.

    సోషల్ మీడియాలో దీని కోసం ఓ ఉద్యమమే నడుపుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఓ కంటెస్టెంట్ కి అదే తరహా మద్దతు దొరుకుతుంది. టాప్ సెవెన్ లో ఉన్న ఆ హీరో కులం తెలుసుకున్న ప్రేక్షకులు ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా పిలుపునిచ్చారు. తన కులానికి చెందిన ఆ కంటెస్టెంట్ టైటిల్ అందుకోవాలని, దాని కోసం మనం తీవ్రంగా కృషి చేయాలని సందేశాలు పంపారు.

    ఆ పర్టిక్యులర్ క్యాస్ట్ వాట్స్ అప్ గ్రూప్స్, ట్విట్టర్ సమూహాలు ఈ సందేశాన్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ పరిణామం పక్కనుండి గమనిస్తున్న వారు ముక్కున వేలు వేసుకుంటున్నారు. నాగరిక సమాజంలో అనాగరిక చర్యగా బిగ్ బాస్ షోని చాలా మంది భావిస్తున్నారు. అందులోని కంటెస్టెంట్స్, ఆ టైటిల్ తుచ్ఛం అన్న భావన చాలా మందిలో ఉంది.

    Also Read: Actress Tapsee: అందంగా కనపడేందుకు అదే నా సీక్రెట్ అంటున్న తాప్సీ…

    అలాంటి ఓ షోలో మన కులపోడు గెలవాలని కోరుకుంటున్న కుల పిచ్చిగాళ్ళ పైశాచికానికి నవ్వుకుంటున్నారు. సమాజం ఇంత సంకుచితంగా ఆలోచిస్తే.. మనం అమెరికా, చైనాల సరసన కాదు కదా.. పక్కనే ఉన్న పాకిస్తాన్ ని కూడా దాటలేం. మరి చూడాలి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకడిగా ఉంటాడనుకుంటున్న ఆ కంటెస్టెంట్ ని కుల ఫీలింగ్ టైటిల్ విన్నర్ ని చేస్తుందో లేదో.

    ఇక ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్ కాగా… మానస్, సిరి, షణ్ముఖ్, కాజల్, సన్నీ, ప్రియాంక, శ్రీరామ్ హౌస్ లో ఉన్నారు. వీరిలో సిరి, ప్రియాంక, కాజల్, శ్రీరామ్, మానస్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. వీరి నుండి ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. మరోవైపు యాంకర్ రవి ఎలిమినేషన్ పై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

    Also Read: Bollywood: బాలీవుడ్ ప్రేమ జంట పెళ్లి… మళ్ళీ వాయిదా ?

    Tags