Kamal Hasan: స్టార్ హీరో కమల్‌హాసన్‌కు ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ నిమిత్తం అమెరికా వెళ్లి వచ్చిన కమల్ ఒంట్లో నలతగా ఉండి పలు కొవిడ్ లక్షణాలు కనిపించడంతో వెళ్లి టెస్టు చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం వైద్యుల సమక్షంలోనే చికిత్స తీసుకుంటూ క్వారంటైన్లో ఉంటున్నారు కమల్. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, ఆయన కుమార్తె శ్రుతి హాసన్ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తున్నారు. తాజాగా, కమల్ ఆరోగ్యంపై వైద్యులు స్పందించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. బిగ్‌బాస్ నిర్వహకులతో హాస్పిటల్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ద్వారా సంప్రదించినట్లు తెలిపారు. కాగా, గతంలోకమల్ రెండు కొవిడ్ టీకాలు వేసుకున్నారని.. అయినప్పటికీ కరోనా బారిన పడ్డారని అన్నారు. కొవిడ్ టీకా వల్లే ఆయన పరిస్థితి విషమం కాకుండా కాపాడాయాని వివరించారు. అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. కొవిడ్ టీకా వేసుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి చెందుతుందని గుర్తించాలని అన్నారు.
Also Read: సాయం చేయలేని సానుభూతి వల్ల ఉపయోగం ఏముంది ?
మరోవైపు కొవిడ్ సరికొత్త వేరియంట్ ఓమిక్రాన్ విజృంభిస్తోంది. ఈ క్రమంలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తాజాగా సమావేశం ఏర్పాటు చేసింది. ఇతర దేశాల నుంచి వ్యక్తులు, రావాణాలపై నిఘా చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కాగా, ప్రస్తుతం కమల్ విక్రమ్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో విజయ్‌సేతుపతి కూడా కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read: లోకనాయకుడు కమల్ హాసన్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల…