https://oktelugu.com/

Big Boss 5 Telugu: అబద్ధాలు కూడా.. ఎంతో చక్కగా చెబుతావంటూ కాజల్ పై విరుచుకుపడ్డ ప్రియా..!

Big Boss 5 Telugu: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో గొడవ పడుతూ బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ లలో భాగంగా కంటెస్టెంట్ ల మధ్య పెద్దఎత్తున పోటీ ఏర్పడి.. చివరకు కంటెస్టెంట్ లు కొట్టుకునే వరకు వెళ్లడంతో రోజురోజుకు ఈ కార్యక్రమంపై ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక రెండవ వారం కెప్టెన్సీ టాస్క్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 17, 2021 / 04:45 PM IST
    Follow us on

    Big Boss 5 Telugu: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో గొడవ పడుతూ బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ లలో భాగంగా కంటెస్టెంట్ ల మధ్య పెద్దఎత్తున పోటీ ఏర్పడి.. చివరకు కంటెస్టెంట్ లు కొట్టుకునే వరకు వెళ్లడంతో రోజురోజుకు ఈ కార్యక్రమంపై ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక రెండవ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రెండు జట్ల మధ్య పోటీ నెలకొని చివరికి విశ్వ రెండవ క్యాప్టెన్ గా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు లగ్జరీ బడ్జెట్ కోసం టాస్క్ నిర్వహించారు. బాల్ పట్టు .. లగ్జరీ బడ్జెట్ కొట్టు అనే కాన్సెప్ట్ తీసుకువచ్చారు.

    ఈ క్రమంలోనే ఈ టాస్క్ లో భాగంగా ఒక చిన్నటి పైప్ నుంచి బాల్ కిందకు పడుతుంది. అయితే ఈ బాల్ కింద పడకుండా ఎవరైతే పట్టుకుంటారో వారు లగ్జరీ బడ్జెట్ సాధించినట్లు. దీనికోసం కంటెస్టెంట్ లు పోటీపడ్డారు. ఈ టాస్క్ తర్వాత బిగ్ బాస్ వరెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అని ఎన్నుకోవాలని సూచించడంతో మొదటగా సన్నీ నటరాజ్ మాస్టర్ ను ఎన్నుకోగా ఆ తరువాత హామీద సన్నీను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ప్రియాంకను కూడా వరెస్ట్ పర్ఫార్మర్ అని ఎన్నుకోవడంతో అందుకు ఆమె వరెస్ట్ పర్ఫార్మర్ అనే వ్యాఖ్యలను ఖండించింది.

    ఇక కంటెస్టెంట్ ప్రియా కాజల్ మధ్య సంభాషణ జరుగుతున్న నేపథ్యంలో ప్రియా కాజల్ ను నీ సంస్కారం కాదు ఇది అంటూ మాట్లాడగా.. నీ విషయంలో నీ సంస్కారం ఇదే అంటూ కాజల్ వాదిస్తుంది. ఈ విషయంపై ప్రియా మాట్లాడుతూ ఇది ఏమాత్రం ఆమోద యోగ్యం కాదు అంటూ ఆమెపై కోప్పడుతూ నువ్వు అబద్దాన్ని కూడా నిక్కస్సుగా ఇలా…ఇలా.. చెబుతావు అంటూ కాజల్ పై విరుచుకుపడింది. ఈ మాటలు ప్రియ అనడంతో కాజల్ తనకు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో చూడాల్సి ఉంది.