SS Rajamouli: తన పేరుకు ముందున్న ఎస్ఎస్ అంటే అర్థం ఏంటో చెప్పిన రాజమౌళి
SS Rajamouli: తెలుగు సినీ పరిశ్రమను తన దర్శకత్వంతో పాన్ ఇండియా స్థాయిలో నెలబెట్టిన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. తొలి నుంచి ఆయన సినిమా ప్రతి సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గానే నిలుస్తూ వచ్చింది. కాగా, ఇటీవలే భారీ అంచనాలతో వచ్చిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడమే కాక.. భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం అందుకు ధీటుగా మరో చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు జక్కన్న.. దాని పేరే ఆర్ఆర్ఆర్. రామ్‌చరణ్, తారక్ హీరోలుగా […]
SS Rajamouli: తెలుగు సినీ పరిశ్రమను తన దర్శకత్వంతో పాన్ ఇండియా స్థాయిలో నెలబెట్టిన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. తొలి నుంచి ఆయన సినిమా ప్రతి సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గానే నిలుస్తూ వచ్చింది. కాగా, ఇటీవలే భారీ అంచనాలతో వచ్చిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడమే కాక.. భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం అందుకు ధీటుగా మరో చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు జక్కన్న.. దాని పేరే ఆర్ఆర్ఆర్. రామ్‌చరణ్, తారక్ హీరోలుగా వస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విడుదలైన ట్రైలర్ కూడా ప్రభంజనం సృష్టిస్తోంది.
కాగా, సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో తనదైన స్టైల్లో రాజమౌళి ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తాజాగా, బిగ్‌బాస్ ఫైనల్స్‌లోనూ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా నాగ్‌తో కలిసి స్టేజ్‌పై సందడిచేశాడు. జక్కన్న స్టేజ్‌పై అడుగుపెట్టగానే.. నాగార్జున మాట్లాడుతూ.. రాజమౌళి గారు.. మీ పేరులో ఉన్న ఎస్ఎస్ అంటే అర్థం ఏంటి?. అని అడిగాడు. దానికి సమాధానంగా.. నిజానికి ఎస్ఎస్ అంటే.. శ్రీశైల శ్రీ రాజమౌళి అంతే.. కానీ.. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే.. సక్సెస్, స్టుపిడ్ అంటారు.. అని నవ్వుతూ చెప్పుకొచ్చారు.
మీరు సక్సెస్ అంటే ఒప్పుకుంటారు కానీ, స్టుపిడ్ అంటే ఒప్పుకోను అంటూ నాగ్ నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. మరి అంతే రేంజ్లో బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుందేమో చూడాలి.