Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఐదు వారాలు ముగించుకుని ఆరో వారంలోకి ఎంటరయ్యింది. బిగ్ బాస్ లో అన్నింటికంటే పెద్ద టాస్క్ నామినేషన్స్. బాగా ఆడినా, ఆడకపోయినా.. నవ్వించినా.. నవ్వించకపోయినా.. ఏ చిన్న తప్పు చేసినా.. చేయకున్నా సరే కంటెస్టెంట్లు కారణాలు చూపి నామినేట్ చేయాల్సి ఉంటుంది. హౌస్ లోని అందరూ దీన్ని భరించాల్సిందే. ఎప్పుడో ఒకప్పుడు నామినేట్ కావాల్సిందే. ప్రతి సోమవారం దీన్ని చేపడతారు. అదే రోజు హౌస్ రసాభాసగా సాగుతుంది.

ఇప్పటికే ఐదుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం నుండి ఇప్పటివరకు గాను సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా ఎలిమినేట్ అయిన సంగతి తెల్సిందే. ఇక ఆరో వారం నామినేషన్ ప్రక్రియ రానే వచ్చేసింది. ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ లో ఉన్న హౌస్ మేట్స్ సంఖ్య మరింత పెరుగుతుంది. నాలుగో వారానికి గాను ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అవ్వగా, ఐదో వారానికి గాను తొమ్మిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు.
బిగ్ బాస్ హౌస్ లో ఆరో వారానికి గాను నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. బిగ్బాస్ నామినేట్ చేయాల్సిన కంటెస్టెంట్స్ ఫోటోలను మంటల్లో వేస్తూ తమ అభిప్రాయాలను చెప్పాలని ఆదేశించాడు. ఇంకేముంది కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. ఒకరిపై మరొకరు వాగ్వాదానికి దిగడమే కాకుండా.. వార్నింగ్స్ ఇచ్చుకున్నారు. అలా మొత్తానికి ఈవారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు షణ్ముఖ్, ప్రియాంక, లోబో, శ్రీరామచంద్ర, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్ అయ్యారు.