Prabhas: టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ ఏ ఇండస్ట్రిలో అయినా సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. బాలీవుడ్ లో ప్రియాంకా చోప్రా , మలైకా అరోరా, సన్నీ లియోన్ , కరీనా కపూర్ , కత్రినా కైఫ్ , జాక్వలిన్ ఫెర్నాండెజ్ వంటి స్టార్ హీరోయిన్ లు ఐటెమ్ సాంగ్స్ లో అలరించారు. స్టార్ హీరోలతో కాలు కదిపితే డబ్బుకు డబ్బు… పేరుకు పేరు వస్తుందని అభిప్రాయ పడుతున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఈ తరుణంలో టాప్ హీరోయిన్లు సైతం స్పెషల్ సాంగ్స్ లో నర్తించేందుకు సై అంటున్నారు. ఇప్పుడు ఆ కోవలోకే వస్తుంది మన సాహో బ్యూటీ శ్రద్దా కపూర్ .

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా… ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ నేతృత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ సలార్ ’. ఈ మూవీ లోని ఓ స్పెషల్ సాంగ్ లో ఓ ప్రముఖ హీరోయిన్ తో డాన్స్ చేయించాలని సినిమా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ముందుగా ఈ పాటలో ప్రభాస్‌తో కలిసి ఆడి పాడేందుకు… కేజిఎఫ్ నటి శ్రీ నిధి శెట్టిని సెలెక్ట్ చేశారనే వార్తలొచ్చాయి. అయితే ప్యాన్ ఇండియా లెవెల్ లో భారీగా నిర్మాణం అవుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టు… స్టార్ హీరోయిన్ అయితేనే బాగుంటుందని మూవీ టీమ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో గతంలో సాహో సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటించిన… శ్రద్దా ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది. కాగా ఈ ఆఫర్ కు ఈ భామ కూడా ఓకే చెప్పగా … భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అలానే శ్రద్దా మంచి డాన్సర్ కావడం కూడా ఇందుకు మరో కారణం అని భావిస్తున్నారు.