https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: సొంత వాళ్ళే సన్నీని సైడ్ చేశారు గా.!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ మొత్తానికి 12 రోజులు పూర్తిచేసుకుంది. ఇటు నాగార్జున తనదైన హోస్టింగ్ తో జనాలను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంటే అటు కంటెస్టెంట్లు కూడా దొరికించే చాన్స్‌ అన్నట్లుగా హౌస్‌లో రెచ్చిపోయి ఆడుతున్నారు. ఇచ్చిన ప్రతి టాస్క్‌ను రఫ్ఫాడిస్తున్నారు. రెండవ వారం లగ్జరీ బడ్జెట్‌ కింద ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ ‘బాల్‌ పట్టు, లగ్జరీ బడ్జెట్‌ కొట్టు’ టాస్క్‌ ఇచ్చాడు. ఇదిలా వుంటే కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ ద్వారా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : September 18, 2021 / 03:29 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ మొత్తానికి 12 రోజులు పూర్తిచేసుకుంది. ఇటు నాగార్జున తనదైన హోస్టింగ్ తో జనాలను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంటే అటు కంటెస్టెంట్లు కూడా దొరికించే చాన్స్‌ అన్నట్లుగా హౌస్‌లో రెచ్చిపోయి ఆడుతున్నారు. ఇచ్చిన ప్రతి టాస్క్‌ను రఫ్ఫాడిస్తున్నారు.

    రెండవ వారం లగ్జరీ బడ్జెట్‌ కింద ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ ‘బాల్‌ పట్టు, లగ్జరీ బడ్జెట్‌ కొట్టు’ టాస్క్‌ ఇచ్చాడు. ఇదిలా వుంటే కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ ద్వారా ఇంట్లో మంట పెట్టిన బిగ్‌బాస్‌ ఇప్పుడు మరోసారి అగ్గి రాజేసాడు.  ఇంటిసభ్యులంతా ఏకాభిప్రాయంతో గుడ్ పర్ఫామర్‌ను, వరస్ట్‌ పర్ఫామర్‌ను ఎంచుకోవాలని ఆదేశించాడు. హౌస్ లోని సభ్యులంతా ఏకాభిప్రాయం తో నటరాజ్ మాస్టర్ ని గుడ్ పర్ఫామర్ గా ఎంచుకోగా, వరస్ట్ పర్ఫామర్ గా సన్నీ ని ఎంచుకున్నారు.

    కెప్టెన్ విశ్వ బిగ్ బాస్ ఆదేశాలు మేరకు వరస్ట్ పర్ఫామర్ ని జైల్ లో కి పంపాడు. ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా చాలా మంచితనంగా తన తప్పుని తెలుసుకుని కూల్ గా జైలు కి వెళ్ళాడు సన్నీ.మొదటివారం వరస్ట్ పర్ఫామర్ గా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జెస్సీ జైలు కి వెళ్తుంటే ఒదార్చి మంచి మాటలు చెప్పి తన దగ్గర కూర్చున్నాడు సన్నీ.
    ఇప్పుడు జెస్సీ కూడా సన్నీ తో పాటు జైలు దగ్గర కూర్చుని మాటలు చెప్తూ అలా కంపెని ఇచ్చాడు.