నందిత స్వస్థలం శ్రీకాకుళం నగరంలోని చిన్నబజారులోని దూదివారి వీధి. ఇక్కడే పుట్టింది నందిత. ఆమె తల్లిదండ్రులు 25 ఏళ్ల క్రితమే సింగపూర్ లో స్థిరపడ్డారు. దీంతో ఆమె తల్లిదండ్రులు సివిల్ ఇంజనీర్లు. ఏవియేషన్ సప్లయ్ చెయిన్ సీనియర్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి మాధురి కూడా సివిల్ ఇంజనీర్ గా పని చేస్తోంది. సోదరుడు హర్ష సౌరవ్ కెనడాలో కంప్యూటర్ సైన్స్ విద్యనభ్యసిస్తున్నాడు.
చిన్నప్పటి నుంచే నందితకు మోడలింగ్ మీద మక్కువ ఎక్కువ. దీంతో ఆ రంగంలోనే రాణించాలని భావించింది. స్కూల్ నుంచే తన కలను నిజయం చేసుకోవాలని తలపించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థలు నిర్వహించే పోటీలకు హాజరయ్యేది. దీంతోపాటు చదువులోనూ మంచి ప్రతిభ చూపెడుతోంది. మేనేజ్ మెంట్ కంప్యూటర్ సైన్స్ లో డ్యూయల్ డిగ్రీ చదువుతూ ఈ రంగంలోకి అడుగుపెట్టింది.
మిస్ యూనివర్స్ సింగపూర్ పోటీలు ఆరు నెలలుగా వివిధ అంశాల్లో పోటీ నిర్వహించి వడబోసిన తరువాత ఆరుగురిని తుది దశకు ఎంపిక చేశారు. అందులో నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు సమర్థంగా జవాబిచ్చిన నందితకు టైటిల్ సొంతం అయింది. డిసెంబర్ లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలకు హాజరుకానుంది. చదువుతోపాటు మోడలింగ్ ఉత్సాహాన్ని ఇస్తోందని చెబుతోంది.