Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 5 Telugu: తనదైన శైలిలో అదరగొట్టిన కింగ్..! 5 మచ్ లవ్ కు...

Bigg Boss 5 Telugu: తనదైన శైలిలో అదరగొట్టిన కింగ్..! 5 మచ్ లవ్ కు ధన్యవాదాలు అంటూ నాగ్ ట్వీట్.

Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న‌బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం ఐదో సీజ‌న్ జ‌రుపుకుంటుంది. మొద‌టి సీజ‌న్‌ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా, రెండో సీజ‌న్‌కి నాని హోస్ట్‌గా ఉన్నారు.ఇక మూడు,నాలుగు సీజ‌న్స్‌ని నాగార్జున హోస్ట్ చేయ‌గా, ఐదో సీజ‌న్‌ని కూడా ఆయ‌నే హోస్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 5 ఆదివారం నుండి స్టార్ మా లో ప్రసారమవుతుంది బిగ్ బాస్. గ‌త రెండు సీజ‌న్స్‌కి భారీ […]

Bigg Boss 5 Telugu: Thanks You For 5 Much Love - Nagarjuna

Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న‌బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం ఐదో సీజ‌న్ జ‌రుపుకుంటుంది. మొద‌టి సీజ‌న్‌ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా, రెండో సీజ‌న్‌కి నాని హోస్ట్‌గా ఉన్నారు.ఇక మూడు,నాలుగు సీజ‌న్స్‌ని నాగార్జున హోస్ట్ చేయ‌గా, ఐదో సీజ‌న్‌ని కూడా ఆయ‌నే హోస్ట్ చేస్తున్నారు.

సెప్టెంబర్ 5 ఆదివారం నుండి స్టార్ మా లో ప్రసారమవుతుంది బిగ్ బాస్. గ‌త రెండు సీజ‌న్స్‌కి భారీ టీఆర్పీలు తీసుకొచ్చిన నాగ్.. సీజన్ 5 తోనూ అదరిపోయే టిఆర్‌పీ రేటింగ్స్ రాబట్టారు . ‘బిగ్ బాస్’ లాంచింగ్ ఎపిసోడ్ (TRP 15.71), 18 TVR.. మార్కెట్‌లో అత్యధికంగా 1303 జీఆర్‌పీ (గ్రాస్ రేటింగ్ పాయింట్) తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు ‘బిగ్ బాస్’. ఈ క్ర‌మంలో నాగార్జున త‌న ఆనందాన్ని తెలియ‌జేస్తూ 5 మ‌చ్ ల‌వ్‌కు ధ‌న్య‌వాదాలు అని తెలిపాడు.

బిగ్ బాస్ సీజ‌న్ 1 లాంచ్ ఎపిసోడ్ కు 16.18 టిఆర్పీ, రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ 15.05 టిఆర్పి దక్కింది. బిగ్ బాస్ సీజన్ 3కి 17.92 టిఆర్పి దక్కింది. ఇక నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్ కు 18.5 టిఆర్పి దక్కింది. బిగ్ బాస్ లాంచ్ చరిత్రలో అదే అత్యధిక టిఆర్పి కావడం విశేషం. నాగార్జున సినిమాల విషయానికొస్తే ప్ర‌స్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ మూవీ చేస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ లో తనయుడు నాగ చైతన్యతో కలిసి నటిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper