
ఐపీఎల్ అనేది ప్రతి కెప్టెన్ కు ముఖ్యమైనదే. అది కోహ్లీకి మరింత ముఖ్యమైందన అందుకే అతను ఒక్కసారి కప్పు గెలవాలి అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రతి ఒక్కరూ అతడు ఆర్సీబీకి ట్రోఫీ అందించాలని అనుకుంటారు. కనీసం ఒక్కసారైనా అది సాధించాలని ఆశిస్తారు. ఈ ఏడాది బెంగళూరు విజేతగా నిలిచే అవకాశం కూడా లేకపోలేదు అని మాజీ ఓపెనర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ మిగిలిన సీజన్ యూఏఈలో జరుగుతున్న నేపథ్యంలో గతేడాది లాగే ముంబాయి ఇండియన్స్, డిల్లీ క్యాపిటల్స్ పేవరెట్ గా కనిపిస్తున్నాయని చెప్పాడు. మరోవైపు అక్కడి స్లో పిచ్ లు చెన్నై, బెంగళూరుకు ఇబ్బందిగా మారొచ్చని సందేహం వక్తం చేశాడు. భారత్ లో చెన్నై సగటు స్కోర్ 201 పరుగులుగా నమోదైందని, అదే యూఏఈలో అయితే వాళ్లు అంతగా రాణించలేరని వీరూ చెప్పుకొచ్చాడు.
ఈసారి కప్పు సాధించేది ఢిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్సేనని తన అభిప్రాయం తెలిపాడు. ఇక చివరగా రాబోయే ఐపీఎల్ లో ఇషాన్ కిషన్, దేవ్ దత్ పడిక్కల్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ ల బ్యాటింగ్ చూడాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఒకవేళ దేవ్ దత్ బాగా ఆడితే తర్వాత టీ20 ప్రపంచకప్ కు ఎంపికయ్యే అవకాశం ఉందన్నాడు. టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ మెంటర్ గా ఉండాలనే ప్రతిపాదనను మహీ అంగీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అతడు మళ్లీ భారత క్రికెట్ లోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అలాగే జట్టు మెంటార్ గా ఎంపికవ్వడం గొప్ప విషయం అని అన్నాడు.