
టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయానికి అతని భార్య అనుష్క శర్మ మద్దతుగా నిలిచింది. కోహ్లీ ప్రకటనను ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేస్తూ.. ఓ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. ఇందులో కోహ్లీని కూడా ట్యాగ్ చేసింది. ప్రస్తుతం అనుష్క ఐపీఎల్ కోసం విరాట్ తో పాటు దుబాయ్ లో ఉంది. పనిభారం పెరిగిపోయిందని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ నిన్న ప్రకటించాడు.