https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: కెప్టెన్సీ టాస్క్ లో కింద పడిపోయిన లోబో.. మెడికల్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్..!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల మధ్య నిత్యం పోట్లాటలు గొడవలు జరుగుతూ ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈవారం కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు ఒక టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ భారీగా పోటీ పడినట్లు తెలుస్తోంది. కెప్టెన్సీని దక్కించుకోవడం కోసం ఏకంగా విచక్షణ కోల్పోయి తారాస్థాయిలో ఒకరిపై ఒకరు దూషించుకుంటూ చివరకు కొట్టుకొని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 15, 2021 / 12:36 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల మధ్య నిత్యం పోట్లాటలు గొడవలు జరుగుతూ ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈవారం కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు ఒక టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ భారీగా పోటీ పడినట్లు తెలుస్తోంది. కెప్టెన్సీని దక్కించుకోవడం కోసం ఏకంగా విచక్షణ కోల్పోయి తారాస్థాయిలో ఒకరిపై ఒకరు దూషించుకుంటూ చివరకు కొట్టుకొని స్థాయికి కూడా వెళ్లారు.

    ఈవారం కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్ లను రెండు గ్రూపులుగా విడదీశారు. ఈగిల్, వూల్ఫ్ జట్లుగా విడదీసి వీరిమధ్య పోటీ పెట్టడంతో రెండు జట్లు గెలవడం కోసం తారాస్థాయిలో పోటీ పడినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం.. కంటెస్టెంట్స్ అందరూ ఎక్కువగా
    బేటేన్స్‌ను సంపాదించుకోవాలి. బేటేన్స్‌ను ఎవరి దగ్గర ఉన్న వాటిని లాకోవచ్చని, ఎవరి దగ్గర అయితే ఎక్కువ
    బేటేన్స్‌ ఉంటాయో వారు ఈ టాస్క్ విజేతలు అని చెప్పడంతో రెండు వర్గాల మధ్య పోటీ నెలకొంది.

    ఈ విధంగా కంటెస్టెంట్స్ నుంచి బేటేన్స్‌ తీసుకోవడం కోసం ఇంటి సభ్యులు మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే కొందరు కంటెస్టెంట్స్ లోబో పై భౌతికంగా, శారీరకంగా అధిక ఒత్తిడికి గురి చేయడంతో లోబో ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇలా కిందపడిన లోబో లేచి పక్కన కూర్చోవడంతో బిగ్ బాస్ వెంటనే మెడికల్ రూమ్ కి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచించారు. బిగ్ బాస్ ఆజ్ఞ మేరకు లోబో మెడికల్ రూమ్ కి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ఇలా ఈ టాస్క్ లో భాగంగా కొందరు కంటెస్టెంట్ లు భౌతికంగా దాడి చేసుకోవడమే కాకుండా మరికొందరికి గాయాలు కూడా అయ్యాయి. అలాగే రెండు జట్ల సభ్యుల మధ్య పరస్పరం మాటలు బేధాభిప్రాయాలు రావడంతో కంటెస్టెంట్ లు గొడవలు పడినట్లు కూడా తెలుస్తుంది.