Jagan bail: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భవితవ్యం ఏమవుతుందన్న టెన్షన్ ఏపీ రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. వీరిద్దరి బెయిల్ రద్దు చేయాలని పోరాడుతున్న ఎంపీ రఘురామ నిన్న ట్విస్ట్ ఇస్తూ సీబీఐ ఇచ్చే బెయిల్ రద్దు తీర్పును హోల్డ్ చేయాలని హైకోర్టుకు ఎక్కాడు. కానీ తాజాగా హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. రఘురామ పిటీషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు సీబీఐ కోర్టు తీర్పునకు లైన్ క్లియర్ చేసింది.
జగన్ , విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు నుంచి కేసు బదిలీ చేయాలంటే సహేతుకమైన కారణాలు ఉండాలని.. ఇక్కడ అవేవీ లేవని హైకోర్టు తాజాగా కొట్టివేసింది. పిటీషన్ల బదిలీకి నిరాకరిస్తూ తీర్పు వెల్లడించారు.
రఘురామకు హైకోర్టులో షాక్ తగలడంతో ఇప్పుడు సీబీఐ కోర్టు జగన్, విజయసాయి బెయిల్ రద్దుపై కీలక తీర్పు వెల్లడించనుంది. రెండు పిటీషన్లపై ఈరోజు తీర్పు వెల్లడించనుంది.
రఘురామ వేసిన పిటీషన్ హైకోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు సీబీఐ కోర్టులో రూట్ క్లియర్ అయ్యింది. ముందుగా చెప్పిన విధంగానే ఈరోజు సీబీఐ కోర్టు సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ లపై తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.
జగన్ బెయిల్ రద్దు అవుతుందా? లేక పిటీషన్లు కొట్టివేస్తారా? రఘురామ వాదన గెలుస్తుందా? జగన్ బెయిల్ కు ఉపశమనం దక్కుతుందా? అన్న టెన్షన్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ తీర్పు రాజకీయ, అధికారవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.