Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన కంటెస్టెంట్ ల మధ్య చిన్న చిన్న విషయాలకు గొడవలు పెరుగుతుంటాయి. ఈ గొడవల కారణంగా కంటెస్టెంట్ లు నామినేషన్స్ వరకు వెళ్తారు. నామినేషన్ చేసినప్పటికీ ఆ విషయం గురించి కూడా హౌస్ లో కొట్లాడటం సర్వసాధారణం. తాజాగా బిగ్ బాస్ 5 లో కూడా ఈ విధమైనటువంటి గొడవలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా హౌస్ లో ఉన్నటువంటి లేడీ కంటెస్టెంట్ ల మధ్య ఎక్కువగా వంట విషయంలో గొడవలు జరగడం సర్వసాధారణం.
తాజాగా సీజన్ ఫైవ్ లో కూడా వంట గురించి హౌస్ లో ఉన్నటువంటి లేడీ కంటెస్టెంట్ ల మధ్య గొడవ జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా లహరి, కాజల్ మధ్య ఈ వివాదం చోటుచేసుకుంది. ఈ గొడవతో ఏకంగా కాజల్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు కాజల్ ఎంతో ధైర్యంగా ఆడుతోందని భావించిన అభిమానులకి కాజల్ ఏడుస్తూ కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు.
మంగళవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో భాగంగా కాజల్, లహరి వంట విషయంలో గొడవ పడతారు. వంట విషయంలో కాజల్ కొద్దిగా అజమాయిషీ చేసే ప్రయత్నం చేయడంతో లహరి కల్పించుకొని ఎక్కువ చేయకు, అంత చేయాల్సిన పనిలేదు ఓవర్ గా రియాక్ట్ అవుతున్నావ్ .. కంటెంట్ కోసం బాగా కష్టపడుతున్నావ్ అంటూ లహరి కాజల్ ను తిట్టడంతో కాజల్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది.ఈ విధంగా ఏడుస్తూ.. అమ్మో తను ఇలా ఏడవడం తన కూతురు చూస్తే చాలా బాధపడుతుంది అంటూ కన్నీళ్లు తుడుచుకుని, ఆ తర్వాత మరి బాధ పడినట్లు తెలుస్తోంది.