https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: దమ్ము కొడుతూ సరయుతో లోబో డిస్కషన్.. నారద మహర్షిగా విశ్వ?

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ కార్యక్రమంలో పాటిస్పేట్ చేసే కంటెస్టెంట్ లు వారి పద్ధతులను కూడా అక్కడ అనుసరిస్తూ.. వారికి నచ్చినట్టుగా వ్యవహరిస్తుంటారు.అయితే హౌస్ లోపల ఉన్న వారు వారి చేస్తున్న ప్రతి ఒక్క పనిని బయట ఎంతో మంది ప్రేక్షకులు చూస్తుంటారు. ఈ క్రమంలోనే అందరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉండవు కనుక ఒక్కొక్కరు ఒక విధమైన ఆలోచనా ధోరణిలో ఉంటారు. సాధారణంగా సెలబ్రిటీలు అన్న తర్వాత చాలామందికి మందు కొట్టడం పొగతాగడం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 8, 2021 / 07:29 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ కార్యక్రమంలో పాటిస్పేట్ చేసే కంటెస్టెంట్ లు వారి పద్ధతులను కూడా అక్కడ అనుసరిస్తూ.. వారికి నచ్చినట్టుగా వ్యవహరిస్తుంటారు.అయితే హౌస్ లోపల ఉన్న వారు వారి చేస్తున్న ప్రతి ఒక్క పనిని బయట ఎంతో మంది ప్రేక్షకులు చూస్తుంటారు. ఈ క్రమంలోనే అందరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉండవు కనుక ఒక్కొక్కరు ఒక విధమైన ఆలోచనా ధోరణిలో ఉంటారు. సాధారణంగా సెలబ్రిటీలు అన్న తర్వాత చాలామందికి మందు కొట్టడం పొగతాగడం వంటి అలవాట్లు ఉంటాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన వారికి కూడా ఈ విధమైనటువంటి అలవాట్లు ఉంటాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

    ఇప్పటివరకు గత సీజన్ లో ముమైత్ ఖాన్ తనీష్ వంటివారు దమ్ము కొడుతూ స్మోక్ జోన్ కి వెళ్ళే వారు. అయితే ఈ సీజన్లో మాత్రం ఏకంగా అమ్మాయిలు కూడా స్మోక్ జోన్ కి వెళ్లడంతో నెటిజన్లు ఎంతో ఆశ్చర్యపోతున్నారు. మొదటి సీజన్లో ముమైత్ ఖాన్ తర్వాత ఇప్పటివరకు స్మోక్ జోన్ కి ఏ అమ్మాయి కూడా వెళ్లలేదు.కానీ సీజన్ ఫైవ్ లో ఏకంగా ఇద్దరు లేడీ కంటెస్టెంట్ వెళ్లడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఎపిసోడ్ లో భాగంగా హమీదా, సరయు ఇద్దరూ కలిసి లోబోతో దమ్ము కొట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.

    తాజాగా మంగళవారం ప్రసాదం కాబోయే ఎపిసోడ్ లో భాగంగా లోబో సరయుతో కలిసి దమ్ము కొడుతూ డీప్ డిస్కషన్ లో ఉంటారు. అంతకు మునుపే సిరి, లోబో గొడవ పడటంతో ఆ గొడవ గురించి సరయు లోబోతో దీర్ఘంగా చర్చలు జరుపుతోంది. అదేవిధంగా హౌస్ లో టీవీ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విశ్వ నారద మహర్షిగా వ్యవహరిస్తూ అందరి విషయాలను తెలుసుకోవడానికి ఆతృత చూపిస్తుండటం గమనార్హం.