Bigg Boss 5 Telugu: బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ కార్యక్రమంలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ ల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. ఈ గొడవల కారణంగా నామినేషన్ కి వెళ్లడం ఈ విధంగా వారిని నామినేట్ చేసిన కంటెస్టెంట్ తో మరోసారి గొడవపడటం వంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. తాజాగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ 5 ప్రారంభం అయ్యి రెండు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోపల గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి.
గతంలో ఏ సీజన్ లో లేని విధంగా ఈ సీజన్లో 19 మంది కంటెస్టెంట్ లను లోపలికి పంపించడమే కాకుండా మొదటిరోజే నాలుగు టాస్క్ లతో ప్రేక్షకులను సందడి చేసిన కంటెస్టెంట్స్ ఆ తరువాత ఎపిసోడ్ నుంచి గొడవలు పడటం ప్రారంభించారు. సోమవారం జరిగిన ఎపిసోడ్ లో భాగంగా నామినేషన్స్ జరగగా అందులో మోడల్ జెస్సీని ఏడిపించారు. అదేవిధంగా సిరి లోబో ఓ విషయం గురించి పోట్లాడుకుంటూ సిరి ఏకంగా లోబోకి మొహం పగులుద్ది అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా మోడల్ జస్వంత్ అలియాస్ జెస్సి, కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ మధ్య చిన్న గొడవ పెరిగి పెరిగి తారాస్థాయికి చేరుకుంది.అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ కూడా వంట విషయంలో ఎక్కువ గొడవలు జరుగుతుంటాయి. గత సీజన్ లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా వంట విషయంలో లహరి, కాజల్ మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే కాజల్ అతిగా స్పందిస్తోంది అంటూ లహరి చేసిన వ్యాఖ్యలకు కాజల్ ఏకంగా కంటతడి పెట్టుకున్నారు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఏ మాత్రం తగ్గకుండా గొడవలు పడుతూ కొట్టుకునే స్థాయికి వెళ్లినట్లు తెలుస్తోంది.