ఆ సమయంలో తన పక్కనే కూర్చున్న హమీదా తన వైపు చూసి నవ్వడంతో షణ్ముఖ్ రవి వంక చూస్తూ.. షి ఇస్ హార్డ్ అని సమాధానం చెప్పగా.. రవి ఎందుకు తన వంక చూడకుండా నా వైపు చూస్తూ సమాధానం చెబుతున్నావ్ అనగా..కొన్ని కొన్ని విషయాలను చెప్పకూడదు సర్ అంటూ రవికి సమాధానం చెబుతాడు. ఈలోగా హమీదా తన చేతిని షణ్ముఖ్ దగ్గరికి చాస్తూ సరే రా.. చెప్పురా.. అనడంతో వెంటనే రవి స్పందించి ఏంటి..సరే రా.. చెప్పురా.. అని నవ్వడంతో వెంటనే లహరి ఇక్కడ చూడండి దీప్తి అంటూ అనడంతో షణ్ముఖ్.. మీకు దండం పెడతా సార్ అని రవిని వేడుకుంటారు. అప్పుడే రవి పిల్లో పై హెచ్ అనే అక్షరం రాస్తా అంటాడు.
హౌస్ లో ఉన్నంత సేపు హెచ్ (హమీదా) అని రాసుకో బయటకు వెళ్లిన తర్వాత డి (దీప్తి) అని రాసుకో అని హమీద చెబుతుంది. ఇదంతా మీరు చూడాలని దీప్తి అంటూ అందరూ ఎంతో సరదాగా నవ్వుకుంటారు. ఈ విధంగా అందరూ హౌస్ లో హాల్లో కూర్చోగా “హలో షన్ను” అంటూ దీప్తి వీడియో కాల్ లో కనిపించి ఆ తరువాత షన్నుకి “ఐ లవ్ యు” అని చెబుతుంది.ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ ఎంతో సరదాగా తనకు బర్త్డే విషెస్ చెప్తూ డ్యాన్సులు చేశారు.ఇక హౌస్ బయట పెద్ద శబ్దాలు రావడంతో అందరూ బయటికి వెళ్లి చూడగా బిగ్ బాస్ షణ్ముఖ్ జస్వంత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుతూ అతనికి సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది.