బిగ్ బాస్ షో ఓ బ్రోతల్ స్వర్గమని అన్నారు. ఇందులో అందరిని ఒకే గదిలో పెడుతూ అన్యాయం చేస్తున్నారు. 105 రోజులు ఒక్క చోట ఉంచడం సముచితం కాదు. లోపల ఏం జరుతుందో అర్థం కావడం లేదు. అశ్లీల సంస్కృతికి ఆజ్యం పోస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతికి ప్రాణం పోస్తున్నారు. దీనిపై గతంలో కూడా ఆయన తన వాణి వినిపించినా ఎవరు పట్టించుకోలేదు. కోర్టు కూడా న్యాయం చేయలేదు.
సమాజానికి సందేశం ఇస్తున్నామనే నెపంతో అడ్డదారులు తొక్కుతున్నారు. మంచి సందేశాలకు బదులు విష సంస్కృతికి బీజం వేస్తున్నారు. సందేశాల మాటున సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. ఎవరికి నచ్చిన విధంగా వారు ప్రవర్తించడం చూస్తుంటే బిగ్ బాస్ ఓ నాటకమని తెలుస్తోంది. జాతీయ భాషలతోపాటు ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారం చేస్తూ తప్పుడు విధానాలు అవలంభిస్తున్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పెగసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా పార్లమెంట్ ఎందుకు విచారణ చేపట్టడం లేదని విమర్శించారు. నారాయణ వ్యాఖ్యలపై మాటీవీ యాజమాన్యం ఏం చేస్తుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.