
తెలుగులో నంబర్ 1 టాప్ రేటింగ్ రియాలిటీ షో ఏదంటే.. అందరూ ఠక్కున చెప్పే సమాధానం బిగ్ బాస్ నే.. ప్రతి ఏడు ఎంతో మంది కొత్తవారిని పరిచయం చేస్తూ వస్తున్న ఈ షో ఎప్పటికీ వన్నెతగ్గనది. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఇప్పుడు ఐదో సీజన్ తో అలరించేందుకు సిద్ధమవుతోంది.
తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కి అంతా సిద్ధమైంది. ఈ మేరకు స్టార్ మా చానెల్ తాజాగా ఒక అద్భుతమైన ప్రోమోను లాంచ్ చేసింది. కొత్త లోగో డిజైన్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. త్వరలోనే బిగ్ బాస్ 5 ప్రసారం కానున్నట్టు తెలిపింది.
బిగ్ బాస్ సీజన్ 5కు హోస్ట్ ఎవరన్నది అంతుచిక్కడం లేదు. గత రెండు సీజన్లు చేసిన నాగార్జున ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారని.. ఆయన స్థానంలో దగ్గుబాటి రానాతో ఈ సీజన్ నడిపిస్తారని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజం ఎంతో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.
ఇక కంటెస్టెంట్లు ఎవరన్నది కూడా అంతుబట్టడం లేదు. కంటెస్టెంట్లలో పలువురు ప్రముఖుల పేర్లు ఈసారి వినిపించాయి. వారు ఉంటారా? ఉండరా? అన్నది తెలియాల్సి ఉంది.
https://www.instagram.com/p/CSBb0tmIfrh/?utm_source=ig_web_copy_link