స్మార్ట్ ఫోన్ లో లక్కీ వీల్ ను తిప్పారా… బ్యాంక్ అకౌంట్ ఖాళీ..?

ఈ మధ్య కాలంలో మోసగాళ్లు కొత్త రకం మోసాలతో తెలివైన వాళ్లను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. ఒక మోసం వెలుగులోకి వచ్చే సరికి మరో మోసంతో అమాయక ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లను వినియోగించే చాలామందికి “లక్కీ వీల్ తిప్పండి.. విలువైన బహుమతులు గెలుచుకోండి” అంటూ లింక్స్ వస్తున్నాయి. పొరపాటున ఆ లింక్ లను క్లిక్ చేస్తే మాత్రం బ్యాంకు ఖాతాల్లోని నగదు మాయమవుతుంది. Also Read: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన గూగుల్.. ఇకపై […]

Written By: Kusuma Aggunna, Updated On : December 16, 2020 10:52 am
Follow us on

ఈ మధ్య కాలంలో మోసగాళ్లు కొత్త రకం మోసాలతో తెలివైన వాళ్లను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. ఒక మోసం వెలుగులోకి వచ్చే సరికి మరో మోసంతో అమాయక ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లను వినియోగించే చాలామందికి “లక్కీ వీల్ తిప్పండి.. విలువైన బహుమతులు గెలుచుకోండి” అంటూ లింక్స్ వస్తున్నాయి. పొరపాటున ఆ లింక్ లను క్లిక్ చేస్తే మాత్రం బ్యాంకు ఖాతాల్లోని నగదు మాయమవుతుంది.

Also Read: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన గూగుల్.. ఇకపై మూడు రోజులే..?

మోసగాళ్ల నయా మోసం వల్ల అమాయకపు ప్రజలు లక్షల రూపాయలు నష్టపోతున్నారు. బ్యాంక్ అకౌంట్లలో లో డబ్బులు మాయమవుతుంటే ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. సైబర్ మోసగాళ్లు ఈ మధ్య కాలంలో విలువైన బహుమతులు పొందే అవకాశం అంటూ వైరస్ ఉన్న లింక్ లను మొబైల్ ఫోన్లకు పంపిస్తున్నారు. ఎవరైనా ఆ స్పిన్ వీల్ పై క్లిక్ చేస్తే వెంటనే విలువైన బహుమతులు గెలుచుకున్నారంటూ పాప్ అప్ యాడ్ కనిపిస్తోంది.

Also Read: జియో కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. కొత్త రకం మోసం..?

సైబర్ మోసగాళ్లు వాట్సాప్, ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాల్లో సైతం ఈ తరహా లింక్ లను తెగ వైరల్ చేస్తున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ లింక్ లను క్లిక్ చేసి మోసపోయిన బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కసారి స్పిన్ వీల్ తిప్పితే స్మార్ట్ ఫోన్ లోకి వైరస్ వస్తోంది. ఈ స్పిన్ వీల్ ద్వారా బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన పూర్తి సమాచారం అవతలి వ్యక్తులకు చేరుతోంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ప్రజలు ఇలాంటి లింక్ లకు ఎంత దూరంగా ఉంటే మంచిది. అనుమానాస్పద లింక్ లను క్లిక్ చేస్తే తర్వాత బాధ పడాల్సి ఉంటుంది. సైబర్‌ క్రైం డీసీపీ రోహిణీ ప్రియదర్శిని గుర్తు తెలియని లింక్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.