Homeఎంటర్టైన్మెంట్బిగ్ బాస్ : సోహెల్ - అరియానా మధ్యే.. !

బిగ్ బాస్ : సోహెల్ – అరియానా మధ్యే.. !

Sohel vs Ariana
బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకుంది. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అఖిల్ ఇప్పటికే ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. పైగా హౌస్ లో కేవలం ఆరుగురు ఇంటి సభ్యులు మాత్రమే మిగిలి ఉండటంతో అసలైన ఆట ఇప్పటినుండి మొదలు కానుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ కూడా ఎవరిని ఎవరికీ హెల్ప్ చేసుకోడానికి వీలు లేకుండా అదిరిపోయే ట్విస్టును ఇవ్వడంతో గేమ్ మరింత రసవత్తరంగా మారింది. ఈ రోజు నుంచి హౌస్ లో కంటెస్టెంట్స్ నడుమ ఎలాంటి ఆట ఉంటుందో అనుకుంటే.. సోహెల్ మరియు అరియానా మధ్య గట్టి పోటీ ఉండేలా అనిపిస్తోంది.

Also Read: పెళ్లి చేసుకోలేదు.. డేటింగ్ మాత్రమే చేస్తున్నా !

కాగా బిగ్ బాస్ ఎవరు ఎక్కువ ఓపికగా ఉంటారో అన్న టాస్క్ లో భాగంగా.. అరియనాను సోహెల్ దారుణంగా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయడం.. ముఖ్యంగా ఆమెకు ఇష్టమైన బట్టలు వస్తువులను పాడు చేస్తూ అరియానా ఓపికకు నిజంగానే సిసలైన పరీక్ష పెట్టాడు. మరి దీనితో అరియానాకు కోపం తెప్పించే ప్రయత్నం చేయడం.. అందుకుతగ్గట్లుగానే అరియానా సీరియస్ అయ్యేలా కనిపిస్తుంది. మరి అరియానా సీరియస్ అయితే గేమ్ ఓడిపోయినట్టే. మరి మ్ అరియానా సహనం కోల్పోయిందా లేదా వీరిద్దరి గొడవ స్టార్ట్ అవుతుందా అన్నది ఫుల్ ఎపిసోడ్ లో రివీల్ కానుంది. మరి ఫుల్ ఎపిసోడ్ లో ఏం జరిగనుందో చూడాలి.

Also Read: శృతి హాసన్ అప్పటినుండే మందు ముట్టలేదు !

ఇక టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అఖిల్ ఈ వారం ఎలిమినేషన్స్ లిస్ట్ లో లేడు కాబట్టి… నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో ఒకరు ఆదివారం ఎలిమినేట్ కానున్నారు. మరి ఆ ఒక్కరు అరియానానే అని ఇప్పటికే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకరు ఎలిమినేట్ అవ్వగానే మిగిలినవాళ్ళు ఫైనల్ కి చేరుకుంటారు. ఫైనల్ కి చేరిన టాప్ ఫైవ్ నుండి ఇద్దరు టాప్ టూకి , వాళ్ళిద్దరిలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ గా నిలవనున్నారు. అయితే ఇప్పటివరకూ గేమ్ ఆడిన విధానాన్ని బట్టి.. టైటిల్ ఫేవరేట్స్ గా అఖిల్, అభిజిత్, సోహైల్ ఉన్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి.. విన్నర్ ఎవరు అనేది అప్పుడే చెప్పలేము.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version