తెలంగాణలో వైసీపీ పాగా.. సహకరిస్తున్న కేసీఆర్..!

తెలంగాణలో ఎదురులేకుండా దూసుకెళుతున్న కారుకు కొద్దిరోజులుగా ఎక్కడికక్కడ బ్రేకులు పడుతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ కు కాలం చెల్లిపోవడంతో టీఆర్ఎస్ ఆటలు సాగడం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే తెలంగాణలు ప్రజలు కేవలం అభివృద్ధిని చూసి మాత్రమే ఓటేస్తుండటంతో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తగులున్నాయి. Also Read: రైతును రాజుగా బతకనివ్వండి.. బానిసగా మార్చొద్దు: పీపుల్స్ స్టార్ తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతోంది. దీంతో సీఎం కేసీఆర్ బీజేపీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. […]

Written By: Neelambaram, Updated On : December 8, 2020 5:36 pm
Follow us on

తెలంగాణలో ఎదురులేకుండా దూసుకెళుతున్న కారుకు కొద్దిరోజులుగా ఎక్కడికక్కడ బ్రేకులు పడుతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ కు కాలం చెల్లిపోవడంతో టీఆర్ఎస్ ఆటలు సాగడం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే తెలంగాణలు ప్రజలు కేవలం అభివృద్ధిని చూసి మాత్రమే ఓటేస్తుండటంతో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తగులున్నాయి.

Also Read: రైతును రాజుగా బతకనివ్వండి.. బానిసగా మార్చొద్దు: పీపుల్స్ స్టార్

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతోంది. దీంతో సీఎం కేసీఆర్ బీజేపీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణలోకి వైసీపీని వ్యూహాత్మకంగా రంగంలోకి దింపేందుకు యత్నిస్తున్నారు. జగన్ సైతం వైసీపీని తెలంగాణలో విస్తరించాలని ఎప్పటి నుంచో భావిస్తుండటంతో ఆ దిశగా పావులు కదుపుతున్నారు.

దివంగత రాజశేఖర్ రెడ్డికి ఏపీలో కంటే తెలంగాణలో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జగన్ ఏపీపై దృష్టిపెట్టడంతో తెలంగాణలో వైసీపీ నామమాత్రంగా మారింది. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వైసీపీ బలోపేతానికి సీఎం కేసీఆర్ సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీ ఓట్లను వైసీపీతో చీల్చడం ద్వారా అధికార పార్టీ లబ్దిపొందాలని భావిస్తుండమే దీనికి ప్రధాన కారణంగా కన్పిస్తోంది.

Also Read: వ్యవసాయ బిల్లులతో రైతులకు లాభామా.. నష్టమా?

తెలంగాణలో వైసీపీ బలోపేత బాధ్యతలను జగన్ తన చెల్లెలు షర్మిలకు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. నగదు బదిలీ అంశాలు తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో వైసీపీ బలపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ను వ్యతిరేకించే రెడ్డి సామాజిక ఓట్లను వైసీపీ పక్షాన మార్చాలన్నదే కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.

తెలంగాణలో బీసీ కార్డును ప్రయోగించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. దీంతో బీసీలు ఆ పార్టీ వైపు మరలే అవకాశం ఉందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఇక టీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్న రెడ్డి సామాజిక వర్గం బీజేపీకి మరలకుండా వైసీపీని రంగంలోకి దింపుతున్నారు. బీజేపీకి ఇతర వర్గాల ఓట్లు వెళ్లకుండా వైసీపీతో చెక్ పెట్టడం ద్వారా టీఆర్ఎస్ లబ్ధిపొందాలని భావిస్తోంది. ఈమేరకు ఇరురాష్ట్రాల సీఎంలు వ్యూహాత్మకంగా తెలంగాణలో పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్