Homeఎంటర్టైన్మెంట్బొమ్మ ఆడించుకున్నారు... డబ్బులు అడిగితే చుక్కలు చూపిస్తున్నారు!

బొమ్మ ఆడించుకున్నారు… డబ్బులు అడిగితే చుక్కలు చూపిస్తున్నారు!

OTT Platform
కరోనా వేళా అన్ని పరిశ్రమలు నష్టపోతే ఓ టి టి సంస్థలు మాత్రం లాభపడ్డాయి. థియేటర్స్ మూతపడడంతో ప్రేక్షకులకు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ప్రధాన వినోద సాధనాలుగా మారిపోయాయి. నెలల తరబడి ఇళ్లకే పరిమితమైన ప్రజలు టైం పాస్ కోసం ఓ టి టి సబ్స్రిప్షన్స్ తీసుకున్నారు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి దిగ్గజ ఓ టి టి సంస్థలు భారీగా తమ చందాదారులను పెంచుకున్నాయి. థియేటర్స్ మూతపడిన కారణంగా విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్ర నిర్మాతలకు, ఓటిటి విడుదల ఏకమైన మార్గంగా మారింది. నెలల తరబడి విడుదల వాయిదా పడడంతో నిర్మాతలపై వడ్డీల భారం పెరగడంతో మనసొప్పకపోయినా తప్పక ఓ టి టి లో విడుదల చేశారు.

Also Read: బిగ్ బాస్ : సోహెల్ – అరియానా మధ్యే..

తక్కువ బడ్జెట్ చిత్రాలే కాకుండా మీడియం బడ్జెట్ చిత్రాలు కూడా ఓ టి టి లో విడుదల అయ్యాయి. నాని, సుదీర్ ల మల్టీస్టారర్ వి, అనుష్క నిశ్శబ్దం, కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా వంటి అనేక చిత్రాలు ఓ టి టి లో అందుబాటులోకి వచ్చాయి. ఇక చిన్న సినిమాలైతే పదుల సంఖ్యలో విడుదల కావడం జరిగింది.

సినిమాలు విడుదల చేసుకొని సొమ్ము చేసుకున్న ఓ టి టి సంస్థలు, సదరు చిత్ర నిర్మాతలకు మాత్రం డబ్బులు చెల్లించలేదట. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం విడుదల తరువాత నిర్ణీత సమయంలో నిర్మాతలకు ఓటిటి సంస్థలు డబ్బులు చెల్లించాల్సి ఉండగా, ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులు పెడుతున్నట్లు సమాచారం అందుతుంది. వరల్డ్ వైడ్ మార్కెట్ కలిగి వందల కోట్ల వ్యాపారం చేస్తున్న దిగ్గజ సంస్థల తీరు నిర్మాతకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది.

Also Read: పెళ్లి చేసుకోలేదు.. డేటింగ్ మాత్రమే చేస్తున్నా !

టాలీవుడ్ నుండి అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ అమెజాన్ లోనే స్ట్రీమ్ కావడం జరిగింది. అమెజాన్ తీరు కూడా ఇలానే ఉందని వినికిడి. థియేటర్ విడుదల లేక వచ్చిన ధరకు సినిమా అమ్ముకొని బయటపడదాం అనుకున్న నిర్మాతలకు ఓ టి టి సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయట.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

Exit mobile version