https://oktelugu.com/

బాలీవుడ్లోకి ‘రేసుగుర్రం’.. పరుగు పెట్టనుందా?

కరోనా క్రైసిస్ నుంచి చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. సినిమా షూటింగులు తిరిగి ప్రారంభమవుతుండటంతో అన్ని ఇండస్ట్రీల్లోనూ సినిమాల సందడి మొదలైంది. టాలీవుడ్లోని దర్శక.. నిర్మాతలు తమిళ్.. మలయాళం సినిమాలను రీమేక్ చేస్తూ హిట్టు కొడుతుంటే బాలీవుడ్ నిర్మాతలు మాత్రం తెలుగు సినిమాలను రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. Also Read: బిగ్ బాస్-4: సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన మొనాల్..! టాలీవుడ్లో సూపర్ హిట్టుగా నిలిచిన సినిమాలన్ని కూడా బాలీవుడ్లో రీమేక్ అవుతుండటం ఇటీవల చాలా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2020 / 05:11 PM IST
    Follow us on

    Bollywood film industry

    కరోనా క్రైసిస్ నుంచి చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. సినిమా షూటింగులు తిరిగి ప్రారంభమవుతుండటంతో అన్ని ఇండస్ట్రీల్లోనూ సినిమాల సందడి మొదలైంది. టాలీవుడ్లోని దర్శక.. నిర్మాతలు తమిళ్.. మలయాళం సినిమాలను రీమేక్ చేస్తూ హిట్టు కొడుతుంటే బాలీవుడ్ నిర్మాతలు మాత్రం తెలుగు సినిమాలను రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు.

    Also Read: బిగ్ బాస్-4: సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన మొనాల్..!

    టాలీవుడ్లో సూపర్ హిట్టుగా నిలిచిన సినిమాలన్ని కూడా బాలీవుడ్లో రీమేక్ అవుతుండటం ఇటీవల చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలపై పెద్దగా దృష్టిసారించని బాలీవుడ్ ఇప్పుడు మాత్రం తెలుగు సినిమాలపై దృష్టిపెడుతుంది. తెలుగులో హిట్టయిన సినిమాలన్నీ కూడా బాలీవుడ్లో రీమేకై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తుండమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

    దీంతో బాలీవుడ్ దర్శక.. నిర్మాతలంతా టాలీవుడ్ సినిమాలను రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో సల్మాన్ ఖాన్.. అజయ్ దేవగణ్.. అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలంతా తెలుగు సినిమాలను రీమేక్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈక్రమంలోనే గతంలో తెలుగులో హిట్ టాక్ తెచ్చుకున్న మిథునం.. ఛత్రపతి.. ఊసరవెల్లి వంటి చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ కాబోతున్నారు.

    Also Read: మేకసూరి-2 రివ్యూ.. హిట్టా.. ఫ్లాపా?

    తాజాగా మరో సూపర్ హిట్ మూవీ బాలీవుడ్లో రీమేక్ కానుందని సమాచారం. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘రేసుగుర్రం’ మూవీతో తెలుగులో ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా హక్కులను పెన్ స్టూడియోస్ సంస్థ దక్కించుకుందని సమాచారం.

    రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ మూవీ హక్కులను కూడా పెన్ స్టూడియోస్ సంస్థనే దక్కించుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్ తో ఛత్రపతి మూవీని బాలీవుడ్లో రీమేక్ చేయబోతుంది. తాజాగా ‘రేసుగుర్రం’ మూవీని బాలీవుడ్లో పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతోంది. ఛత్రపతిలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తుండగా.. రేసుగుర్రంలో ఏ హీరో నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్