https://oktelugu.com/

బిగ్ బాస్-4.. ఎలిమినేషన్ లీక్.. ఈసారి మోహబూబ్ ఔట్

బిగ్ బాస్-4 రియల్టీ షో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. గత సీజన్లకు భిన్నంగా ఢిఫరెంట్ టాస్కులతో అభిమానులను అలరిస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్-4 పదోవారం కొనసాగుతోంది. ఆదివారం ఎలిమినేషన్ ఉండటంతో ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరా? అనే ఆసక్తి మొదలైంది. అయితే యథావిధిగా బిగ్ బాస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది లీక్ అయింది. Also Read: టాలీవుడ్ అప్డేట్: మేనేజర్లు కాస్తా నిర్మాతలుగా మారుతున్నారా? బిగ్ బాస్-4 తొలి నుంచి ఎలిమినేషన్ పెద్దగా సస్పెన్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 15, 2020 / 12:00 PM IST
    Follow us on


    బిగ్ బాస్-4 రియల్టీ షో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. గత సీజన్లకు భిన్నంగా ఢిఫరెంట్ టాస్కులతో అభిమానులను అలరిస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్-4 పదోవారం కొనసాగుతోంది. ఆదివారం ఎలిమినేషన్ ఉండటంతో ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరా? అనే ఆసక్తి మొదలైంది. అయితే యథావిధిగా బిగ్ బాస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది లీక్ అయింది.

    Also Read: టాలీవుడ్ అప్డేట్: మేనేజర్లు కాస్తా నిర్మాతలుగా మారుతున్నారా?

    బిగ్ బాస్-4 తొలి నుంచి ఎలిమినేషన్ పెద్దగా సస్పెన్స్ ఉండటం లేదు. బిగ్ బాస్ హౌస్ ఎవరు ఎలిమినేషన్ ఎవరవుతారనేది ప్రేక్షకులు ముందుగానే ఊహిస్తున్నారు. దీనికితోడు ముందస్తుగా బిగ్ బాస్ నుంచి లీకులు వస్తుండటంతో ఎలిమినేషన్ ప్రక్రియ పెద్దగా ఆసక్తిని రేపడం లేదని తెలుస్తోంది. అయితే ఈ వారం మాత్రం మోహబూబ్ దిల్ సే ఎలిమినేషన్ అవుతున్నట్లు లీకులు వస్తున్నాయి.

    బిగ్ బాస్-4లో అందరికంటే చిన్న వయస్సుడిగా మోహబూబ్ దిల్ సే ఉన్నాడు. శని, ఆదివారాల్లో హోస్టు నాగార్జున కంటెస్టులతో ఆటలు ఆడించి ఎలిమినేషన్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. శనివారం అభిజిత్ ను సేవ్ చేసిన నాగార్జున ఆదివారం మిగతా వారిని సేవ్ చేసి ఆటను కొనసాగించనున్నాడు. చివరికి ఎలిమినేషన్లలో మోహబూబ్.. మరో కంటెస్టెంట్ మిగిలడంతో ఎలిమినేషన్ ఆసక్తిని రేపుతోంది.

    Also Read: మాస్టర్ టీజర్ రిలీజ్: విజయ్ వర్సెస్ విజయ్..!

    బిగ్ బాస్-4 పదోవారంలో అందరికీ కంటే మెహబూబ్ దిల్ సేకు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అతడు ఇంటి నుంచి వెళ్లిపోయడం ఖాయంగా కన్పిస్తోంది. మోహబూబ్ తో సోహైల్.. మోనాల్.. లాస్య.. అరియానాలకు మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో వారంతా అతడి ఎలిమినేషన్ పై ఎమోషన్ అయినట్లు తెలుస్తోంది.

    ఎలిమినేషన్ తర్వాత స్టార్ మా నిర్వహించే బిగ్ బాస్ బజ్ లో మోహబూబ్ పాల్గొన్న ఫొటోలు తాజాగా లీకయ్యాయి. రాహుల్ సింప్లిగంజ్.. మోహన్ బూబ్ ను ఇంటర్వ్యూ చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వారం మోహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అవడం ఖాయమని స్పష్టమవుతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్