https://oktelugu.com/

బిగ్ బాస్-4: అనినాష్ కోసం అరియానా ఎమోషనల్.. అసలేం జరిగిందంటే?

బిగ్ బాస్-4లో ఆదివారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ ఆద్యంతం నాటకీయంగా సాగింది. డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ వెళ్లిపోతాడనే ముందే లీకైనా చివరివరకు నామినేషన్ ఫుల్ డ్రామాను తలపించింది. ఎలిమినేషన్ చివరల్లో అమ్మ రాజశేఖర్.. అవినాష్ మిగిలింది. దీంతో వీరిద్దరు ఒకరు ఎలిమినేట్ అవుతారని హోస్టు నాగార్జున ప్రకటించాడు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ వీరిద్దరిలో అవినాష్ ఎలిమినేట్ అవుతున్నట్లు ‘బిగ్ బాస్’ చూపించడంతో  ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. గతవారమే ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న అమ్మ రాజశేఖర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2020 / 03:39 PM IST
    Follow us on

    బిగ్ బాస్-4లో ఆదివారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ ఆద్యంతం నాటకీయంగా సాగింది. డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ వెళ్లిపోతాడనే ముందే లీకైనా చివరివరకు నామినేషన్ ఫుల్ డ్రామాను తలపించింది. ఎలిమినేషన్ చివరల్లో అమ్మ రాజశేఖర్.. అవినాష్ మిగిలింది. దీంతో వీరిద్దరు ఒకరు ఎలిమినేట్ అవుతారని హోస్టు నాగార్జున ప్రకటించాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    వీరిద్దరిలో అవినాష్ ఎలిమినేట్ అవుతున్నట్లు ‘బిగ్ బాస్’ చూపించడంతో  ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. గతవారమే ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న అమ్మ రాజశేఖర్ ఈ వారం కెప్టెన్సీ దక్కించుకోవడంతో అతడు ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటాడా? అనే ఆసక్తి నెలకొంది. వీరిద్దరి హోస్టు నాగార్జున గార్డెన్ ఏరియాలో ఉన్న రెండు బూత్‌లలోకి వెళ్లాలని సూచించాడు.

    Also Read: Bigg Boss4: ఒకరిపై ఒకరు పంచ్ లేసుకున్న సుమ-నాగ్..!

    వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని.. మరొకరు బ్యాక్ వస్తారని నాగార్జున తెలిపాడు. తన ఎలిమినేషన్‌పై కాన్ఫిడెన్స్‌తో ఉన్న అమ్మ రాజశేఖర్ తానే వెళ్లిపోయేది.. అవినాష్‌ వస్తాడంటూ చెప్పుకొచ్చాడు. ఈక్రమంలోనే అవినాష్‌ గురించి అరియానా ఎమోషన్ అయ్యింది. అతడి దగ్గరికి వెళ్లి అనినాష్ నుంచి మాట తీసుకోవడంతో వీరిద్దరి అటచ్ మెంట్ అందరికీ తెల్సింది.

    Also Read: కాజల్ రోమాన్స్.. ఈసారి భర్తతో.. డంగవుతున్న ఫ్యాన్స్..!

    ఎలిమినేషన్లలో ఒకవేళ అటూ ఇటూ అయితే ‘నాకోసం వెయిట్‌ చేయ్‌.. నేను రాగానే నిన్ను కలుస్తా.. నీ ప్రాబ్లమ్స్ గురించి ఏమీ ఆలోచించకు.. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు ప్లీజ్‌.. మమ్మీ మీద ప్రామిస్ చేయ్.. నీ కాళ్లు పట్టుకుంటా.. ఏం చేసుకోకు ప్లీజ్.. నువ్వు బతికుండు చాలు ప్లీజ్.. ప్లీజ్’ అంటూ అరియానా వెక్కివెక్కి ఏడ్చేసింది.చివర్లో అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ కాగా అవినాష్ సేఫ్ అయ్యాడు. అయితే ఈసారి అవినాష్ కన్నీటీ పర్యాంతమయ్యాడు. ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయిన అవినాష్ మాట్లాడుతూ గుండె ఆగినంత పనైందని.. మళ్లీ జీరోకు వచ్చానని చెప్పానని చెప్పాడు. బిగ్‌బాస్‌ వల్లే తనకు మళ్లీ కొత్త లైఫ్ వచ్చిందంటూ ఎమోషన్ అయ్యారు. మొత్తానికి ఆదివారం నాటి ఎపిసోడ్ ఫుల్ ఎమోషనల్.. డ్రామాతో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.