రూ.250 కోట్ల వరదసాయం దోచుకున్నారు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లో వరద సాయం కోసం రూ.500 కోట్లు కేటాయించినా టీఆర్ఎస్ నేతలే రూ.250 కోట్లు దోచుకున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట వరద బాధితులతో కలిసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మట్లాడుతూ సీఎం కుమారుడు కేటీఆర్ ప్రజల కోసం కాకుండా తన సొంత ప్రయోజనాల కోసమే కార్యక్రమాలు చేపడుతారని విమర్శించారు. లోతట్టు ప్రాంతల్లో వరదలు ముంచెత్తుతుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. […]

Written By: Suresh, Updated On : November 9, 2020 3:42 pm
Follow us on

హైదరాబాద్ లో వరద సాయం కోసం రూ.500 కోట్లు కేటాయించినా టీఆర్ఎస్ నేతలే రూ.250 కోట్లు దోచుకున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట వరద బాధితులతో కలిసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మట్లాడుతూ సీఎం కుమారుడు కేటీఆర్ ప్రజల కోసం కాకుండా తన సొంత ప్రయోజనాల కోసమే కార్యక్రమాలు చేపడుతారని విమర్శించారు. లోతట్టు ప్రాంతల్లో వరదలు ముంచెత్తుతుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఎల్బీనగర్, కూకట్ పల్లి మల్కాజ్ గిరి జోనల్ కమిషనర్ లకు కూడా వివారాలిచ్చి ఫిర్యాదు చేశాం. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులకు చెప్పి నిజమైన లబ్ధిదారులకు సహాయం అందించాలని చూశామని, అయితే జీహెచ్ఎంసీ కమిషనర్ మా రాకను చూసి పారిపోయాడని విమర్శలు చేశారు.