https://oktelugu.com/

Bigboss: ఎప్పుడో పెట్టిన కేసులో బిగ్​బాస్​ నటి అరెస్టు!

Bigboss: ప్రముఖ డాన్సర్​ సప్నా చౌదరి త్వరలో అరెస్టు కానున్నట్లు తెలుస్తోంది. బిగ్​బాస్​లోనూ ఈమె కంటెస్టంట్​గా పాల్గొంది. అయితే, 2018 అక్టోబరు 14న లక్నోలోని ఆషియానా పోలీసు స్టేషన్​లో సప్నా చౌదరిపై ఓ కేసు నమోదైంది. లక్నోలోని ఓ షోలో సప్నా చౌదరి డాన్స్ పర్ఫార్మన్స్ ఉంది అయితే, ఆమె డాన్స్ చూడటం కోసం చాలా మంది ప్రేక్షకులు స్టేజ్​ దగ్గర ఎదురుచూస్తున్నారు. అర్ధరాత్రి అయినా ఆమె రాకపోవడంతో ఆ కార్యక్రమం పూర్తిగా ఆగిపోయింది. అయితే, దీనిపై […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 19, 2021 / 10:58 AM IST
    Follow us on

    Bigboss: ప్రముఖ డాన్సర్​ సప్నా చౌదరి త్వరలో అరెస్టు కానున్నట్లు తెలుస్తోంది. బిగ్​బాస్​లోనూ ఈమె కంటెస్టంట్​గా పాల్గొంది. అయితే, 2018 అక్టోబరు 14న లక్నోలోని ఆషియానా పోలీసు స్టేషన్​లో సప్నా చౌదరిపై ఓ కేసు నమోదైంది. లక్నోలోని ఓ షోలో సప్నా చౌదరి డాన్స్ పర్ఫార్మన్స్ ఉంది అయితే, ఆమె డాన్స్ చూడటం కోసం చాలా మంది ప్రేక్షకులు స్టేజ్​ దగ్గర ఎదురుచూస్తున్నారు.

    అర్ధరాత్రి అయినా ఆమె రాకపోవడంతో ఆ కార్యక్రమం పూర్తిగా ఆగిపోయింది. అయితే, దీనిపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు టికెట్​ కొని తమ సమయాన్ని వృధా చేసుకున్నామని మండిపడ్డారు. ఈ క్రమంలోనే తాను టికెట్​ కోసం ఖర్చు పెట్టిన రూ.300 తిరిగి ఇవ్వాల్సిందిగా డిమాండ్​ చేశారు. ఈ మేరకు పలువురు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    తమలాగే వేలాది మంది ఆ షోకి వచ్చి ఆమె డాన్స్​ కోసం ఎదురుచూశారని.. అయితే సప్న రాకపోడం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తమ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి వెనక్కి ఇవివాల్సిందిగా డిమాడ్​ చేశారు. ఈ మేరకు సప్నా చౌదరితో పాటు షో ఆర్గనైజర్స్​ జునైద్​ అహ్మద్​, నవీన్ శర్మ, ఇవాద్ అలీ, అమిత్ పాండే, రత్నాకర్ ఉపాధ్యాయ్ లపై కాసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే త్వరలో సప్నా చౌదరిపై పోలీసులు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.