https://oktelugu.com/

Pushpa: కేరళలో పుష్ప సందడి.. ఇప్పటి నుంచే స్పెషల్​ షోస్​కు బుకింగ్​ స్టార్ట్!​

Pushpa: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. పాన్​ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇందులో రష్మికా హీరోయిన్​గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్​, సునీల్​ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు అనసూయ కూడా మాస్​ క్యారెక్టర్​లో దర్శనమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబరు 17న ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఇటీవలే హిందీ వర్షన్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 19, 2021 / 10:44 AM IST
    Follow us on

    Pushpa: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. పాన్​ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇందులో రష్మికా హీరోయిన్​గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్​, సునీల్​ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు అనసూయ కూడా మాస్​ క్యారెక్టర్​లో దర్శనమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబరు 17న ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఇటీవలే హిందీ వర్షన్​ విడుదలకు సంబంధించిన సమస్యలు కూడా తీరిపోయినట్లు తెలుస్తోంది.

    అల్లు అర్జున్​కు కేరళలోనూ భారీగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే 40 థియేటర్లలో పుష్ప బుకింగ్స్ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ 40 థియేటర్లలో ఫ్యాన్​ షో వేయనున్నట్లు సమాచారం. అయితే, డిసెంబరు 17నాటికి ఆ రాష్ట్రంలో 100కిపైగా థియేటర్లలో పుష్ప విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సునీల్, ఫాహద్ ఫజిల్ ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    ప్రస్తుతం సినిమా షూటింగ్​ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు సుకుమార్​. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్​ ఈ సినిమాను నిర్మిస్తోంది.  జగపతి బాబు, సునీల్, అనసూయ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.