Ghani Movie: గని మూవీ నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్… టీజర్ రిలీజ్ అప్పుడే అంటున్న వరుణ్ తేజ్…

Ghani Movie: మెగా ఫ్యామిలి నుంచి “ముకుంద” సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. కంచె చిత్రంతో తనలోని నటుడికి ప్రాణం పోసి  ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు ఈ యంగ్ హీరో. ఆ తర్వాత వచ్చిన లోఫర్​, ఫిదా, గద్దలకొండ గణేశ్​ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు కురిపించాయి. ఇక విక్టరీ వెంకటేష్ తో కలిసి “ఎఫ్​ 2” సినిమాలో స్క్రీన్​ షేర్ చేసుకున్నారు వరుణ్​. ఆ చిత్రం కూడా మంచి […]

Written By: Raghava Rao Gara, Updated On : November 11, 2021 12:07 pm
Follow us on

Ghani Movie: మెగా ఫ్యామిలి నుంచి “ముకుంద” సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. కంచె చిత్రంతో తనలోని నటుడికి ప్రాణం పోసి  ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు ఈ యంగ్ హీరో. ఆ తర్వాత వచ్చిన లోఫర్​, ఫిదా, గద్దలకొండ గణేశ్​ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు కురిపించాయి. ఇక విక్టరీ వెంకటేష్ తో కలిసి “ఎఫ్​ 2” సినిమాలో స్క్రీన్​ షేర్ చేసుకున్నారు వరుణ్​. ఆ చిత్రం కూడా మంచి విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ “గని” సినిమాలో నటిస్తున్న విశయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ కి సంబంధించి ఓ అప్డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది.

ఈ సినిమా టీజర్‌ విడుదల తేదీ తో పాటు సినిమాలో పాత్రలను పరిచయం చేసింది చిత్ర బృందం. నవంబర్‌ 15 వ తేదీన ఈ సినిమా టీజర్‌ ను రిలీజ్‌ చేస్తున్నట్లు అనౌన్స్‌ చేసింది. అలాగే.. ఈ సినిమా పాత్రలను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ అప్డేట్‌ తో మెగా ప్యాన్స్‌ లో నూతన కోలాహలం నెలకొంది. ఈ సినిమా ను టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. కాగా సిద్దు ముద్ద, అల్లు బాబీ కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా… తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాను డిసెంబర్‌ 3 వ తేదీన విడుదల చేయనున్నారు.

https://twitter.com/GeethaArts/status/1458660903004475392?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1458660903004475392%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fmanalokam.com%2Fnews%2Fghani-movie-release-date-out-2.html