https://oktelugu.com/

Khiladi Movie: మాస్ మహారాజ్ రవితేజ “ఖిలాడి” విడుదల తేదీ ఖరారు…

Khiladi Movie:  మాస్ మహారాజ్ రవి తేజ వరుస సినిమాలతో దూసుకుపోతూ ఫుల్ ఫామ్ లో ఉన్నదని చెప్పాలి. ఆయన తాజాగా రమేష్​ వర్మ దర్శకత్వంలో  “ఖిలాడి” అనే సినిమాలో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్​ ఎల్​ ఎల్పీ పతాకంపై సత్యనారాయణ కోనేరు… వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలానే రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్…  ఈ సినిమాకి ​స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా… యాక్షన్​ కింగ్​ అర్జున్​ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కాగా ఇప్పుడు […]

Written By: , Updated On : November 11, 2021 / 12:19 PM IST
Follow us on

Khiladi Movie:  మాస్ మహారాజ్ రవి తేజ వరుస సినిమాలతో దూసుకుపోతూ ఫుల్ ఫామ్ లో ఉన్నదని చెప్పాలి. ఆయన తాజాగా రమేష్​ వర్మ దర్శకత్వంలో  “ఖిలాడి” అనే సినిమాలో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్​ ఎల్​ ఎల్పీ పతాకంపై సత్యనారాయణ కోనేరు… వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలానే రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్…  ఈ సినిమాకి ​స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా… యాక్షన్​ కింగ్​ అర్జున్​ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కాగా ఇప్పుడు తాజాగా సినిమా గురించి ఓ అప్డేట్​ వచ్చింది.
ravi teja khiladi movie release date confirmed by movie team

అయితే తాజాగా ఖిలాడీ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. వచ్చే ఏడాది శివ రాత్రి కానుకగా  ఫిబ్రవరి 11 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ తాజా అప్డేట్‌ తో రవితేజ అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, టీజర్​,  పాటలకు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

మరోవైపు రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో… యసెల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో  కూడా నటిస్తున్నారు. మాస్ మహారాజా సరసన మజిలీ బ్యూటీ దివ్యాన్ష్ కౌశిక్, మలయాళ కుట్టి రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అలానే ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు రవితేజ. ఈ సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి.