Homeఎంటర్టైన్మెంట్మే 31న మహేష్ బాబు నుండి బిగ్ సర్ ప్రైజ్ !

మే 31న మహేష్ బాబు నుండి బిగ్ సర్ ప్రైజ్ !

Mahesh Babu‘సూపర్ స్టార్ మహేష్ బాబు’కు తన తండ్రి కృష్ణ పుట్టిన రోజున ఏదొక గిప్ట్ ఇవ్వడం ఒక అనవాయితీ. మరి, మే 31న కృష్ణ పుట్టిన రోజు. కాబట్టి మహేష్ ఆ రోజు ఏ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు ? కృష్ణ ప్రతి పుట్టిన రోజుకూ మహేష్ తన సినిమాకి సంబంధించి ఒక క్రేజ్ అప్ డేట్ ను తమ అభిమానులతో పంచుకుని వారికీ మంచి కిక్ ను ఇస్తూ ఉంటాడు. అలాగే ఈ సారి అలాంటి కిక్ ను ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ?

ఇప్పటికే త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమా ప్రకటన కూడా మేడే నాడే స్పెషల్ గా ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి కొత్తగా ప్రకటించడానికి ఏమి లేదు. కానీ ప్రతి ఏడాది తన తండ్రి పుట్టిన రోజున అభిమానులకు ట్రీట్ ఇవ్వడం అనేది మహేష్ కి సెటిమెంట్. తన కొత్త సినిమా టీజర్ రూపంలోనో, లేదా కనీసం తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ తోనే, ఏది కుదరకపోతే ఆ సినిమాలో తన లుక్ ను రివీల్ చేసే ఒక పోస్టర్ ను రిలీజ్ చేసో మహేష్ మొత్తానికి ఫ్యాన్స్ ను ఖుషి చేస్తాడు.

ఈ సారి ఏమి చేస్తాడో, గత ఏడాది పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా టైటిల్ ని ప్రకటించి, కృష్ణగారికి మంచి గిప్ట్ ఇచ్చారు. ఈ పుట్టినరోజుకి కూడా ఆ సినిమాకు సంబంధించే ఏదోకటి రిలీజ్ చేస్తారేమో. ఎలాగూ ‘సర్కారు వారి పాట’ నుండి పోస్టర్స్ తప్ప ఇప్పటివరకూ ఏమి రిలీజ్ కాలేదు. కాబట్టి, కచ్చితంగా ఈ సినిమా నుండి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ కావడం ఖాయం అంటున్నారు.

ఒకవేళ ఈ సినిమా టీజర్ అప్పటిలోగా ఫినిష్ కాకపోతే, త్రివిక్రమ్ – మహేష్ సినిమా నుండి ఆ రోజు సినిమా టైటిల్ లేదా ఫస్ట్ లుక్ పోస్టరో లేదా మరేదైనా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది. మరి… మే 31న మహేష్ బాబు ఏమి సర్ ప్రైజ్ చేశారో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version