Animal : ఒక సినిమా సక్సెస్ లో దర్శకుడు కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు. హీరో ఎంత బాగా యాక్టింగ్ చేసినా కూడా ప్రేక్షకులను మెప్పించకపోతే మాత్రం సినిమా డిజాస్టర్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాగే దర్శకుడు ఆ సినిమాని ఎలా డ్రైవ్ చేశాడు అనేది కూడా చాలా కీలకపాత్ర వహిస్తూ ఉంటుంది… అందుకే దర్శకులు సినిమాలను తెరకెక్కించినప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగితే సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది టాలెంట్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) లాంటి దర్శకుడికి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తు ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక 2017 వ సంవత్సరంలో అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ సినిమాతో పెను సంచలనాన్ని సృష్టించాడు. ఆయన ఆ తర్వాత బాలీవుడ్ వెళ్ళిపోయి అర్జున్ రెడ్డి సినిమాని కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించింది. ఇక ఆ తర్వాత ఆనిమల్ సినిమాను చేసి సెన్సేషన్ ని క్రియేట్ చేశాడు. ఈ సినిమా 900 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ లో రన్బీర్ కపూర్ లుంగీ కట్టుకొని కనిపిస్తాడు…
అయితే తన పక్కనున్న వాళ్ళందరూ సూటేసుకొని ఉంటారు. మరి దానికి భిన్నంగా ఈయన లుంగీ కట్టుకొని వస్తాడు. అయితే డైరెక్ట్ గా లుంగీ చుట్టుకొని వస్తే ఏదో జర్క్ వచ్చినట్టుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో లుంగీ ఎందుకు కట్టుకున్నాడు అనేదాని కోసం సపరేట్ గా ఒక సీను కూడా డిజైన్ చేసుకున్నాడు.
అదేంటి అంటే డ్రాయర్ క్వాలిటీ లేకపోవడం వల్ల ఆయనకు లోపల రశేష్ వచ్చాయని ఇలాంటి క్వాలిటీ లేని డ్రాయర్లను నేను వాడలేను అని చెప్పి ఆ డ్రాయర్ ని పక్కన పెట్టి లుంగీ కట్టుకొని వస్తాడు. అలా రావడం వల్ల లుంగీ ఎందుకు కట్టుకున్నాడు అనే డౌట్ ఎవరికీ రాదు. అలాగే సీన్ లో ఒక ఫ్లో అయితే ఉంటుంది. కాబట్టి దాని కోసమే ఆ డ్రాయర్ సీన్ ను క్రియేట్ చేశానని సందీప్ రెడ్డి వంగా చెప్పాడు.
నిజంగా ఆయన ఒక సీన్ గురించి లోతుగా ఆలోచించి ఆ సీన్ లో ట్రీట్ మెంట్ ని రాస్తాడు అనేది చూస్తే మనకు చాలా ఆశ్చర్యమేస్తుంది. ఇక ఇలాంటి సీన్లతోనే ఆయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రతి సీన్ కి డీటైలింగ్ అనేది చాలా క్లియర్ కట్ గా ఇస్తుంటాడు. కాబట్టే సందీప్ రెడ్డివంగ ఇప్పుడు ఇండియాలో టాప్ డైరెక్టర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…