Star Heroes: కొన్ని కారణాల వల్ల చాలా మంది స్టార్ హీరోలు తమ సొంత రాష్ట్రంలోని అమ్మాయిని కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్లు ఎక్కువగా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు నుంచి అల్లు అర్జున్ వరకూ ఈ జాబితాలో చాలామంది ప్రముఖులు ఉన్నారు.
సొంత రాష్ట్రం అమ్మాయిని పెళ్లి చేసుకోని స్టార్ హీరోలు
* మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుది తెలంగాణ/ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఆయన బాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమె స్వరాష్ట్రం మహారాష్ట్ర. 2005లో వీరి వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు గౌతమ్ కాదా మరో కుమార్తె పేరు సితార.
* అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగువాడు, కానీ ఆయన భార్య స్నేహా రెడ్డి (హైదరాబాద్, తెలంగాణ) కి చెందినవారు. 2011లో వీరి పెళ్లి జరిగింది.వీరి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయాన్, అర్హ. వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా ఫేమస్.
* పవన్ కళ్యాణ్ – అన్నా లెజ్నేవా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి వివాహం తెలుగమ్మాయితోనే అయినా, ఆయన మూడో పెళ్లి రష్యా మోడల్ అన్నా లెజ్నేవాతో జరిగింది. అప్పట్లో ఇది తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద సంచలనమైంది. ప్రస్తుతం పవన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా విధులు నిర్వహిస్తున్నారు.
* నాగార్జున – అమల అక్కినేని
కింగ్ నాగార్జున తన మొదటి భార్య లక్ష్మిని విడిచిపెట్టాక, తమిళ నటి అమల అక్కినేనిని పెళ్లి చేసుకున్నారు. అమల తమిళనాడుకు చెందినవారు. వారికి అఖిల్ అక్కినేని కూమారుడు కలిగారు. అఖిల్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నాడు.
* ధూళిపాళ జగపతిబాబు – లక్ష్మి
ప్రముఖ నటుడు జగపతిబాబు, తెలంగాణ/ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. కానీ, ఆయన భార్య లక్ష్మి కేరళకు చెందినవారు.
* వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాటి
వరుణ్ తేజ్ మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు అన్న సంగతి తెలిసిందే. వీరు తెలుగు వారు.కానీ వరుణ్ తేజ్ ఉత్తర ప్రదేశ్ కు చెందిన లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రముఖ హీరోయిన్ వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్న సమయంలోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.
* నాని – అంజనా యలవర్తి
న్యాచురల్ స్టార్ నాని తెలంగాణకు చెందిన స్టార్ హీరో. తను ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంజనా యలవర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కలిగారు. ప్రస్తుతం నాని నిర్మాతగా, హీరోగా వరుస సినిమాలను చేస్తున్నారు.
* యష్ – రాధిక పండిట్
కెజిఎఫ్ స్టార్ యష్ గురించి పరిచయం అక్కర్లేదు. యష్ స్వతహాగా కర్ణాటకకు చెందిన వారు. తన భార్య రాధిక పండిట్ మహారాష్ట్ర ముంబైకి చెందిన వారు. ఆమెను తన బలం, ప్రాణ స్నేహితురాలిగా యష్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన సంగతి తెలిసిందే.
* గోపీచంద్ – రేష్మా
మ్యాచో స్టార్ గోపీచంద్ స్వతహాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడు. తన భార్య రేష్మా రాజస్తాన్ కు చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వారు.
* రవితేజ – కళ్యాణి
రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. ముగ్గరు కొడుకుల్లో రవితేజ పెద్దవాడు. ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మసిస్టు. తల్లి రాజ్యలక్ష్మి గృహిణి. రవితేజకు ఇద్దరు తమ్ముళ్లు. రవితేజ తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించక ముందు ఉత్తర భారతదేశంలో జైపూర్, ఢిల్లీ, ముంబై, భోపాల్ మొదలైన ప్రదేశాలన్నీ తిరిగాడు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అతడి భార్య పేరు కళ్యాణి. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మరి ఎందుకు హీరోలు తమ రాష్ట్రం అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదంటే?
సినిమా పరిశ్రమ జాతీయస్థాయికి ఎదగడంతో, ఇతర రాష్ట్రాల హీరో, హీరోయిన్ల మధ్య పరిచయాలు పెరిగాయి.ఎక్కువ మంది ముంబై, కేరళ, తమిళనాడు హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే వారు ఫిల్మ్ ఇండస్ట్రీలో కలిసిపోవడమే దీనికి కారణం. కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకున్నారు. అందుకే వారి రాష్ట్రం కాకుండా పోయింది.