Maruti Grand Vitara : మారుతి సుజుకి మరోసారి తన ప్రిమియం SUV గ్రాండ్ విటారా ధరను భారీగా పెంచింది. ఇప్పటికే దేశీయ మార్కెట్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హైబ్రిడ్ SUV ధరలు తాజాగా రూ. 20,000 వరకు పెరిగాయి. మారుతి సుజుకి ఈ కారును సిగ్మా, డెల్టా, జీటా, జీటా ప్లస్, ఆల్ఫా వంటి అనేక వేరియంట్లలో అందిస్తోంది. తాజా ధరల పెంపుతో గ్రాండ్ విటారా SUV ధర ఇప్పుడు రూ. 11.19 లక్షల నుండి రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా అధునాతన టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో నిండిన ప్రీమియం SUVగా మార్కెట్‌లో దూసుకుపోతోంది.
డిజైన్,స్టైల్
స్టైలిష్ నెక్సా గ్రిల్ తో వస్తుంది. స్పోర్టీ డ్యూయల్ టోన్ బాడీ తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. లీన్ LED హెడ్‌లాంప్స్, DRLs, అగ్రెసివ్ బంపర్ డిజైన్, పనోరమిక్ సన్‌రూఫ్ లో గ్రాండ్ విటారా కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఈ కారు నెక్సా బ్లూ, ఓపులెంట్ రెడ్, గ్రాండ్యుర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఇంటీరియర్స్
కారు లోపల 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, యాంబియంట్ లైటింగ్, హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వస్తుంది.
సేఫ్టీ, సెక్యూరిటీ:
ప్రయాణీకుల భద్రతపై మారుతి సుజుకి పూర్తి ఫోకస్ పెట్టింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360° డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్ ను అమర్చారు.
పవర్‌ట్రెయిన్ & మైలేజీ
మారుతి గ్రాండ్ విటారాలో హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్), CNG పవర్‌ట్రెయిన్ లభించనున్నాయి. ఇందులో 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ (పెట్రోల్), 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (ఎలక్ట్రిక్+పెట్రోల్), 1.5-లీటర్ CNG మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ వస్తుంది. అంతే కాకుండా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, e-CVT గేర్‌బాక్స్ (హైబ్రిడ్ వేరియంట్‌కి మాత్రమే) అందజేస్తుంది. ఈ కారు పెట్రోల్ మోడల్ లీటరుకు 19 నుండి 27కిలో మీటర్ల మైలేజీ అందజేస్తుంది. CNG మోడల్ కిలోకు 26.6 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
ఎవరికి పోటీగా మారుతుందంటే?
SUV సెగ్మెంట్‌లో మారుతి గ్రాండ్ విటారా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్, మహీంద్రా స్కార్పియో క్లాసిక్ లకు గట్టి పోటీని ఇస్తుంది. అయితే, ధరలు పెరిగినప్పటికీ మార్కెట్లో గట్టి పోటీని తట్టుకునేలా మారుతి గ్రాండ్ విటారా మెరుగైన హైబ్రిడ్ టెక్నాలజీతో ముందుకు సాగుతోంది.