
Ustad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంచి ఊపు మీదున్నాడు.ఒక పక్క సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తూనే మరో పక్క రాజకీయాలలో బిజీ గా ఉంటూ పార్టీ ని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేస్తూ సమస్యలపై పోరాటం చేస్తున్నాడు.అయితే సినిమాల పరంగా ప్రస్తుతం ఆయన ‘హరి హర వీరమల్లు’ , ‘ఉస్తాద్ భగత్ సింగ్’ , ‘#OG’ మరియు వినోదయ్యా సీతం రీమేక్ లో నటించబోతున్నాడు.వీటిల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం గురించి ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియా ని ఊపేస్తోంది.
అదేమిటంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు ‘అల్లు అర్హ’ పవన్ కళ్యాణ్ కి కూతురుగా నటించబోతుందట.నటనకి ప్రాధాన్యం ఉన్న ఈ పాత్ర కోసం ‘అల్లు అర్హ’ లాంటి క్యూట్ పాప అయితేనే బాగుంటుందని డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవలే అల్లు అర్జున్ ని కలిసి కోరగా, ఆయన కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఇది వరకే ‘అల్లు అర్హ’ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ అనే సినిమా లో భరతుడి పాత్రని పోషించింది.ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లో కూడా మనం అల్లు అర్హ ని చూడొచ్చు.అంతే కాకుండా ప్రస్తుతం మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా అల్లు అర్హ ని తీసుకున్నట్టు తెలుస్తుంది.
చూస్తూ ఉంటే ఈ చిన్నారి త్వరలోనే టాలీవుడ్ లో స్టార్ కిడ్ గా అవతరించబోతుందని అనిపిస్తుంది.క్యూట్ లుక్స్ తో ఎంతో ముద్దొచ్చే ఈ పాప వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయ్యాయి.అల్లు అర్జున్ కూడా తన కూతుర్ని చూసి ఎంతో మురిసిపోతూ వీడియోలు షేర్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ అమ్మాయికి అవకాశం రావడం చూసే మెగా ఫ్యాన్స్ కి కనుల పండుగే అని చెప్పొచ్చు.