Ram Charan – Prashant Neel Movie : సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సిరీస్ తో ఈయన దేశ వ్యాప్తంగా సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఆయన ప్రభాస్ తో చేసిన ‘సలార్’ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇలా వరుసగా ఆయన చేసిన సినిమాలన్నీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడంతో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సూపర్ స్టార్స్ అందరూ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయడానికి క్యూలు కట్టారు. అయితే అందరికంటే ముందు చూపుతో ఎన్టీఆర్ మైత్రీ మూవీ మేకర్స్ తో మాట్లాడించి ప్రశాంత్ నీల్ చిత్రాన్ని లాక్ చేయించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తోనే ఆయన సినిమాని ముందుగా మొదలుపెట్టబోతున్నాడు. ఈ చిత్రం పేరు ‘డ్రాగన్’ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రభాస్ తో ‘సలార్ 2’ చిత్రం చేయబోతున్నాడు.
ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వగానే ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నట్టు లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఈ చిత్రాన్ని #RRR నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగి చాలా కాలం అయ్యింది. కానీ అప్పుడు కేవలం స్టోరీ లైన్ ని మాత్రమే వినిపించాడు, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సాగుతుంది. మరోపక్క రామ్ చరణ్ కూడా తన లుక్స్ ని పూర్తిగా మార్చేశాడు. ఈ నెల నుండే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరోపక్క ఆయన శంకర్ తో చేసిన ‘గేమ్ చేంజర్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకోని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరుపుకుంటుంది.
డిసెంబర్ 20 వ తారీఖున ఈ చిత్రం విడుదల అవ్వబోతుందని టాక్. ఈ రెండు చిత్రాల తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో ఒక పీరియడ్ జానర్ చిత్రం చేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాతనే ప్రశాంత్ నీల్ చిత్రం పట్టాలెక్కనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో సౌత్ ఇండియాకి సంబంధించిన ఒక ప్రముఖ సూపర్ స్టార్ నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడని కూడా టాక్ వినిపిస్తుంది. దీని గురించి మరికొన్ని వివరాలు అతి త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి. రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ తో ప్రశాంత్ నీల్ లాంటి టాప్ డైరెక్టర్ తో సినిమా చేస్తే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సెన్సేషనల్ కాంబినేషన్ రవి బర్సుర్ సంగీతం అందించనున్నాడు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More