Salaar 2 Shooting : బిగ్ బ్రేకింగ్ : ‘సలార్ 2 ‘ షూటింగ్ మొదలు..20 రోజుల భారీ షెడ్యూల్ లో పాల్గొంటున్న ప్రభాస్..ఎన్టీఆర్ సినిమా అటకెక్కినట్లేనా ?

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పింది మూవీ టీం. 'సలార్ 2' షూటింగ్ మొదలైందని, 20 రోజుల పాటు ప్లాన్ చేసిన ఈ భారీ షెడ్యూల్ లో ప్రభాస్ కూడా త్వరలో పాల్గొంటాడని, వచ్చే ఏడాది మార్చి నెల లోపు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి, 2025 డిసెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని గ్రాండ్ గా విడుదల చేస్తారని తెలుస్తుంది.

Written By: Vicky, Updated On : October 23, 2024 3:14 pm

Salaar 2 Shooting

Follow us on

Salaar 2 Shooting : ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ కి చేసిన ‘సాహూ’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ‘ఆదిపురుష్’ చిత్రం కారణంగా ప్రభాస్ చాలా నెగటివిటీ ని కూడా ఎదురుకున్నాడు. ఇక మళ్ళీ ఆయన ఈ నెగటివిటీ నుండి కోలుకొని సూపర్ హిట్ అందుకుంటాడా?, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొడుతాడా? అని అభిమానులు, ట్రేడ్ విశ్లేషకులు ఎదురు చూస్తున్న సమయంలో ఆయన నుండి ‘సలార్’ చిత్రం విడుదలైంది. కేజీఎఫ్ సిరీస్ వంటి వెండితెర అద్భుతాన్ని ఆవిష్కరించిన ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కనీవినీ ఎరుగని రేంజ్ లో ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ టీజర్ , ట్రైలర్ ఇలా ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ అభిమానులనే కాకుండా, ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.

అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, రికార్డు వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 600 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టి ప్రభాస్ కి సరైన సమయంలో సరైన బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇకపోతే ఈ సినిమా పార్ట్ 2 కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పార్ట్ 1 క్లైమాక్స్ లో ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాదానాలు ‘సలార్ 2 : శౌర్యంగపర్వం’ లో దొరుకుతాయని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించడం లో సక్సెస్ అయ్యాడు. అయితే పార్ట్ 2 సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తి అయ్యింది.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పింది మూవీ టీం. ‘సలార్ 2’ షూటింగ్ మొదలైందని, 20 రోజుల పాటు ప్లాన్ చేసిన ఈ భారీ షెడ్యూల్ లో ప్రభాస్ కూడా త్వరలో పాల్గొంటాడని, వచ్చే ఏడాది మార్చి నెల లోపు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి, 2025 డిసెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని గ్రాండ్ గా విడుదల చేస్తారని తెలుస్తుంది. అయితే ప్రశాంత్ నీల్ ఇటీవలే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాని ప్రారంభించాడు కదా, పూజా కార్యక్రమాలకు సంబంధించిన వీడియో ని కూడా విడుదల చేసారు, ఇప్పుడు ఆ సినిమాని పక్కన పెట్టేశారా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుమానాలను వ్యక్తం చేసారు. అయితే అలాంటిది ఏమి లేదని, ప్రభాస్, ఎన్టీఆర్ డేట్స్ కి తగ్గట్టుగా, ఇరు సినిమాల షూటింగ్స్ సమాంతరంగా జరుగుతాయని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మరి ఈ రెండు సినిమాల షూటింగ్స్ ని సమాంతరం గా ప్రశాంత్ నీల్ ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి.