https://oktelugu.com/

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ టీం నభీల్, మణికంఠ కోసమే పని చేస్తుందా..? ఇంత అన్యాయమైన వివక్షకు కారణం ఏమిటి?

ముఖ్యంగా కొంతమంది కంటెస్టెంట్స్ ని పని గట్టుకొని పైకి లేపే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ నుండి కంటెంట్ కోసం ఉద్దేశపూర్వకంగా అలా చేస్తున్నారో, లేకపోతే నిజంగానే వాళ్ళు మ్యానేజ్మెంట్ కోటానో ఆడియన్స్ కి అర్థం కావడం లేదు. ఈ కోటాలో నభీల్, మణికంఠ మరియు విష్ణు ప్రియ కచ్చితంగా ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : October 14, 2024 / 08:54 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8:  ఈ సీజన్ బిగ్ బాస్ లో అనేక అంశాలు కేవలం కొంతమంది కంటెస్టెంట్స్ కి మాత్రమే అనుకూలంగా బిగ్ బాస్ టీం వ్యవహరిస్తుందని ప్రేక్షకులకు అనిపించింది. ముఖ్యంగా కొంతమంది కంటెస్టెంట్స్ ని పని గట్టుకొని పైకి లేపే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ నుండి కంటెంట్ కోసం ఉద్దేశపూర్వకంగా అలా చేస్తున్నారో, లేకపోతే నిజంగానే వాళ్ళు మ్యానేజ్మెంట్ కోటానో ఆడియన్స్ కి అర్థం కావడం లేదు. ఈ కోటాలో నభీల్, మణికంఠ మరియు విష్ణు ప్రియ కచ్చితంగా ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత వారం నభీల్ చాలా తప్పులు చేసాడు, కానీ ఆ తప్పులన్నిటినీ వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున కవర్ చేసే ప్రయత్నం చేసాడు. ఉదాహరణకు ప్రేరణ విషయం లో నభీల్ కచ్చితంగా మెచ్యూరిటీ లేని వాడిగానే ప్రవర్తించాడు. ఆమె గురించి వెనుక చేరి హౌస్ లో 15 మంది సభ్యులు ఉంటే, 15 మంది దగ్గరకి వెళ్లి చాడీలు చెప్పాడు.

    ఇది నిజంగా చిన్న పిల్లల బుద్ధి అని చెప్పొచ్చు. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా ప్రేరణ విషయంలో మాత్రం నభీల్ చేసింది ముమ్మాటికీ తప్పే, దీనిని శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కూడా చెప్పుకొచ్చాడు, కానీ ఆదివారం ఎపిసోడ్ లో దానిని కవర్ చేసేసాడు. ఇక సంచాలక్ గా అయితే అయితే ఆయన తీసుకున్న నిర్ణయం కచ్చితంగా తప్పే. ఒక పరీక్షలో అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన వాడికి మార్కులు వేస్తారా..?, లేదా 100 లో 99 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పిన వారికి మార్కులు వేస్తారా..?, కానీ నభీల్ రెండవ దానికే మార్కులు వేసాడు. దీనిని నాగార్జున సమర్ధించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక మణికంఠ విషయం లో కూడా బిగ్ బాస్ టీం చాలా వివక్ష చూపిస్తుంది. హౌస్ లో మూడవ వారంలో ప్రేరణ, యష్మీ ఆడిన ఆట తీరుని కనీసం గుర్తించలేదు నాగార్జున. ఆ వారం మొత్తం వీళ్లిద్దరు ఆడపులులు లాగా రెచ్చిపోయి టాస్కులు ఆడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది, ఒక్క నాగార్జున కి తప్ప.

    కచ్చితంగా వాళ్ళ గురించి ఆ వారం ప్రత్యేకంగా మాట్లాడి AV వీడియో వేయాలి, కానీ ఆ రెండు చేయలేదు, గత వారం మణికంఠ కాస్త బాగా ఆడేలోపు అతని మీద ఏకంగా AV వీడియో చేసి చూపించాడు. ఒక హోస్ట్ గా అందరికీ సమ దృష్టితో చూడాల్సిన నాగార్జున, ఇలా యష్మీ , ప్రేరణ విషయం లో పక్షపాతం చూపించడం ఎంత వరకు కరెక్ట్?..ఇక విష్ణు ప్రియ విషయంలో కూడా అదే చేస్తున్నాడు. ఈమెకు కచ్చితంగా బలమైన కోటింగ్ పడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆమె హౌస్ యోగా చేయడం, పృథ్వీ వెనుక తిరగడం, వీకెండ్ ఎపిసోడ్స్ లో తింగరబుచ్చి లాగా ఓవర్ యాక్షన్ చేయడం, డ్యాన్స్ వేయడం తప్ప ఏమి చేయడం లేదు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ గేమ్ బలంగా ఆడాలి అనే కసి ఉంది, ఒక్క విష్ణు ప్రియ లో తప్ప. ఒక్క వారం కూడా ఆమెకు గేమ్ విలువ ఏంటో తెలిసేలా చేయలేదు నాగార్జున. ఇలా ఈ ముగ్గురి పట్ల కచ్చితంగా బిగ్ బాస్ టీం, నాగార్జున మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన కంటెస్టెంట్స్ ని ఎలా ట్రీట్ చేస్తారో, అలాగే ట్రీట్ చేస్తున్నారు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.